మొహంతికి పొడగింపు: ఘాటు లేఖ, కృష్ణారావు సెలవు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించినట్లు సమాచారం. చివరి నిమషంలో ప్రధానమంత్రి మన్మోహన్ జోక్యం చేసుకుని ఆయన పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించినట్లు సమాచారం తెలుస్తోంది.

రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మరో మూడు నెలలు ఆయనను పదవిలో కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ప్రధాన కార్యదర్శి నియామకం సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా సాగుతుంది.

Mohanty term extended: IYR Krishna Rao on leave

అయితే ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంది. ఒకవేళ మహంతి రాజీనామా చేసి ఉంటే, ఆయన స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావును నియమించే అవకాశం ఉండేది.

మహంతీ పదవీకాలం పొడగింపుతో అవకాశం కోల్పోయిన కృష్ణారావు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆగ్రహంతో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘాటుగా లేఖ రాశారు. పది రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఇతర రాష్ట్రాలవారికి పొడగింపు ఇవ్వడం స్థానిక క్యాడర్‌ను అవమానించడమేనని ఆయన అన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారికే పొడగింపు ఇవ్వాల్సి ఉంటుందని, అలా జరగలేదని ఆన్నారు.

మరో సీనియర్ ఐఎస్ అధికారి ప్రశాంత్ మహాపాత్ర పదవీ విరమణ చేశారు. కాగా, మహంతి పదవీ కాలం పొడగింపుపై మరో ఐఎఎస్ అధికారి శామ్యూల్ కూడా తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన క్యాట్‌ను ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+