గిన్నిస్‌బుక్: హుస్సేన్‌కు అలీ అభినందనలు(పిక్చర్స్)
హైదరాబాద్: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యతను ప్రదర్శించి నగరానికి చెందిన యువతీ, యువకులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అంతర్జాతీయ బాడీ బిల్డర్ మోతెషామ్ అలీ అన్నారు. ముక్కుతో వేగవంతంగా టైప్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న పాతబస్తి తలాప్ కట్టకు చెందిన మహ్మద్ కుర్షిద్ హుస్సేన్‌కు మంగళవారం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోతెషామ్ అలీ మాట్లాడుతూ.. విద్య తోపాటు క్రీడల్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని అన్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారికి ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కుర్షిద్ హుస్సేన్‌కు అభినందనలు ఆయన తెలిపారు. నిరంతరం సాధన చేసి టైపింగ్ తోనే రికార్డు నెలకొల్పానని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన కుర్షిద్ హుస్సేన్ ఈ సందర్భంగా అన్నారు.
2012లో చేతులతో అతివేగంగా టైపింగ్ చేసి 3.43 సెకండ్లలో గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందినట్లు, ఆ తర్వాత ముక్కుతో టైప్ చేసి 103 పదాలను 47.44 సెకండ్లలో పూర్తి చేసి రెండవసారి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించానని తెలిపారు. అంతర్జాతీయ కరాటే క్రీడాకారిణి సైదా ఫలక్, సామాజిక కార్యకర్త అక్బర్ హుస్సేన్, నిజాం కాలేజి హిందీ విభాగం హెచ్ఓడి అవినాశ్ జైశ్వాల్, తదితరలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

హుస్సేన్‌కు సన్మానం
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యతను ప్రదర్శించి నగరానికి చెందిన యువతీ, యువకులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అంతర్జాతీయ బాడీ బిల్డర్ మోతెషామ్ అలీ అన్నారు.

హుస్సేన్‌కు సన్మానం
ముక్కుతో వేగవంతంగా టైప్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న పాతబస్తి తలాప్ కట్టకు చెందిన మహ్మద్ కుర్షిద్ హుస్సేన్‌కు మంగళవారం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో సన్మానం నిర్వహించారు.

హుస్సేన్‌కు సన్మానం
మోతెషామ్ అలీ మాట్లాడుతూ.. విద్య తోపాటు క్రీడల్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని అన్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారికి ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కుర్షిద్ హుస్సేన్‌కు అభినందనలు ఆయన తెలిపారు.

హుస్సేన్‌కు సన్మానం
నిరంతరం సాధన చేసి టైపింగ్‌తోనే రికార్డు నెలకొల్పానని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన కుర్షిద్ హుస్సేన్ ఈ సందర్భంగా అన్నారు.












Click it and Unblock the Notifications