మూడ్ ఆఫ్ ఏపీ: ఏ పార్టీకి ఎన్ని సీట్లు, గెలుపు ఎక్కడ - వారికి డేంజర్ బెల్స్, బిగ్ ఛేంజ్...!!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు పూర్తవుతోంది. 2024 ఎన్నికల్లో దాదాపు ఏకపక్షంగా విజయం సాధించింది. అప్పుడే ఏపీలో 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు అమలు దిశ గా కసరత్తు చేస్తున్నాయి. ఈ సమయంలో ఇండియా టూడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ లో భాగంగా ఏపీలో పబ్లిక్ మూడ్ పై సర్వే చేయగా.. ఆ అంచనాలను వెల్లడించింది. అందులో భాగంగా ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి.
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు.. 2029 ఎన్నికల దిశగా వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఎవరికి వారు ప్రజల్లో తమ ఇమేజ్ పైన ధీమాతో ఉన్నాయి. కాగా.. ఇండియా టూడే- సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాల పైన ప్రజాభిప్రాయం వెల్లడించింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ వైపే జనం మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. కాగా, ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఇప్పుటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో తిరిగి 20 స్థానాలు గెలుస్తాయని అంచనా వేసింది. 2024 ఎన్నికల్లో కూటమి 21 లోక్ సభ స్థానాలను గెలవగా.. వైసీపీ నాలుగు స్థానాలకు పరిమితం అయింది. అయితే, ఇప్పుడు బీజేపీ తిరిగి అదే విధంగా పోటీ చేస్తే ఒక స్థానం కోల్పోతుందని అంచనా వేసింది.

మారుతున్న సమీకరణాలు
ఏపీలో బీజేపీకి పార్టీ పరంగా అంత సానుకూలత లేదనే సంకేతాలు ఈ సర్వేలో కనిపించినట్లు విశ్లేషణలు ఉన్నాయి. రాజమండ్రి, అనకాపల్లి, నర్సాపురం లో ఒక సీటు కోల్పోయే అవకాశం ఉన్నట్లుగా సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ మరింతగా బలపడి.. తమ స్థానాలను 8 నుంచి 10కి పెంచుకుంటుందని అభిప్రాయపడింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం లో ఉన్నా.. బీజేపీ- జేడీఎస్ కలిసి తమ బలం పెంచుకుంటున్నాయని విశ్లేషణ చేసింది. ఇక, కీలకమైన తమిళనాడులో విజయ్ హవా కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీకి సీట్లు పెరగకపోయినా.. ఓట్ల శాతంలో పెరుగుదల కనిపిస్తోంది. విజయ్ పార్టీకి ఎంపీ సీట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే, ఏపీలో ఈ సర్వే వెల్లడించిన అంశాల్లో కూటమి ఐక్యత- సీట్ల ఖరారు, ఓట్ల బదిలీ ప్రధాన అంశంగా ప్రస్తావన చేసింది.













Click it and Unblock the Notifications