కీలక స్ధానాల్లో స్త్రీలు, 2 గ్రామాల దత్తత: సీతారామన్
హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు. మహిళలు తాము పనిచేసే చోట కీలక స్ధానాలు దక్కించుకోవాలని.. దాంతో సమాజంలో తమ స్ధానాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు.
అఖిల భారత విద్యార్ధి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విజయవాడలో ఏర్పాటు చేసిన మహిళల భద్రతపై రెండు రోజుల సెమినార్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా భద్రత - సవాళ్లు - పరిష్కార మార్గాలు అనే అంశంపై సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ కార్పోరేట్ వ్వవహారాలు, ప్రభుత్వ రంగ సెక్టార్‌లో మహిళలు మరింతగా రాణించాలన్నారు. చట్టం ఒక్కటే మహిళకు రక్షణ కల్పించలేదని అభిప్రాయపడ్డారు. మహిళలపై హింసను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

బాలికల్లో ప్రశ్నించే తత్వం పెరగాలని... మాట్లాడటమే మహిళలకు స్వీయ రక్షణ అని పేర్కొన్నారు. తాను రెండు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పశ్చియ గోదావరి జిల్లాలోని నర్సాపురం మండలంలోని పెద్దమైనవలంక, తూర్పు తండా గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
గత 20 సంవత్సరాల నుంచి ఈ రెండు గ్రామాలతో తనకు పరిచయం ఉందన్నారు. గ్రామాల దత్తత విధివిధానాలను త్వరలో తెలియజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుతోపాటు వివిధ కాలేజీలకు చెందిన సుమారు 450 మంది అమ్మాయిలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications