ఏపీ మండలికి కొత్త ఛైర్మన్..డిప్యూటీ - రేపే ఎన్నిక..!! ఆ ఇద్దరి పేర్లకు సీఎం ఆమోదం..!!
ఏపీ శాసన మండలికి కొత్త ఛైర్మన్ .. డిప్యూటీ ఛైర్మన్ ఎంపికకు రంగం సిద్దమైంది. ప్రస్తుత సమావేశాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఈ ఒక్క రోజు మాత్రమే సమావేశానికి ప్రభుత్వం సిద్ద పడింది. అయితే, బీఏసీ సమావేశంలోనూ ఆ నిర్ణయం మారింది. ఈ నెల 26వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మండలిలో ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు నామినేషన్లు వేసారు. ఆ ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయటంతో వారి ఎంపిక లాంఛనమే.

ఈ సమావేశాల్లోనే కొత్త ఛైర్మన్ ఎన్నిక
అయితే, ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉప సంహరణకు సమయం ఉండటంతో ఆ రోజున వారి ఏకగ్రీవం లాంఛనంగా కనిపిస్తోంది. ఈ సమావేశాలు ముగిసిన తరువాత ఇక, బడ్జెట్ సమావేశాలే ఉండే అవకాశం ఉంది. దీంతో..స్థానిక సంస్థల ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ సైతం ముగిసిన తరువాత మండలి ఛైర్మన్.. వైస్ ఛైర్మన్ ఎంపిక చేపడుదామని భావించినా.. ఫిబ్రవరి వరకూ నిరీక్షించకుండా ఈ సమావేశాల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా, ఈ నెల 19న మండలి కొత్త ఛైర్మన్ .. వైస్ ఛైర్మన్ ఎంపిక జరగనుంది.

ఎస్సీ - బీసీ వర్గాలకు ప్రాధాన్యత
ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 11 స్థానాలకు వైసీపీ అభ్యర్దులను ఖరారు చేసింది. వారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీరి చేరితో మండలిలో వైసీపీ సంఖ్యా బలం 32 కు చేరుతుంది. ఇక, టీడీపీ హయాంలో ఛైర్మన్ గా పని చేసిన షరీఫ్.. డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం పదవీ విరమణ చేసారు. వారి స్థానంలో ఇప్పుడు వైసీపీ నుంచి కొత్త వారు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఇందు కోసం ముఖ్యమంత్రి జగన్ ఆ రెండు స్థానాల భర్తీకి కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

పార్టీ ఏర్పాటు నుంచి విధేయుడిగా గుర్తింపు
శాసనసభలో స్పీకర్ గా బీసీ వర్గానికి ఇవ్వటంతో..మండలి ఛైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా జగన్ పార్టీ ప్రకటన నుంచి మద్దతుగా నిలవటంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా ఉన్న పశ్చిమ గోదావరికి చెందిన కొయ్యే మోషేన్ రాజు పేరు ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం మోషేన్ రాజు రాజమండ్రి పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2014, 2019 లోనూ ఎమ్మెల్యే సీటు ఆశించినా .. దక్కకపోవటంతో ఆయనకు మండలి ఛైర్మన్ పదవి కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

సామాజిక సమీకరణాల్లో భాగంగా జంగాకు
ఇక, ఎస్సీ వర్గానికి మండలి ఛైర్మన్ పదవి కేటాయించి..డిప్యూటీ ఛైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత జంగా క్రిష్ణమూర్తిని ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ సీఎం అయిన సమయం నుంచి ప్రతీ ఎంపికలోనూ 50 శాతం ఎస్సీ..బీసీ..మైనార్టీ వర్గాలకు కేటాయిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ 14 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత శాసన మండలిలో వైసీపీకి చెందిన 32 మంది సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 18 మంది ఉంటారు. దీని ద్వారా తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాకే మండలి ఛైర్మన్... గుంటూరు జిల్లాకు డిప్యూటీ ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి. దీనికి సంబంధించి ముందుగా ప్రొటెం స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ ...ఆ తరువాత ఎంపిక..బాధ్యతల స్వీకరణ ఉండనుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications