అతి దారుణంగా.. పైశాచికంగా.. తల్లీకూతుళ్లు మర్డర్..!
రామచంద్రాపురం : ఏమైందో తెలియదు.. ఎవరు చంపారో తెలియదు.. ఎందుకు హత్య చేశారో తెలియదు. తల్లీకూతుళ్లను అతి దారుణంగా చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. తల్లితో పాటు కూతురును అంత పైశాచికంగా ఎవరు చంపారో తెలియక స్థానికంగా విషాదం నెలకొంది. శనివారం నాడు రాత్రి జరిగిన ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లీకూతుళ్లను దుండగులు హత్య చేశారనే వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
రామచంద్రాపురంలోని చప్పిడివారి సావరం దండు గంగమ్మ గుడి వీధిలో జరిగిన ఈ జంట హత్యలు అనుమానాస్పదంగా మారాయి. తల్లీకూతుళ్లను దుండగులు పొట్టనబెట్టుకున్న తీరు స్థానికంగా భయాందోళన రేకెత్తించింది. గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా సుత్తె (హ్యామర్) తో కొట్టి హతమార్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని ఇరుగు పొరుగు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

45 సంవత్సరాల బలుస మాధవి స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆయాగా పని చేస్తున్నారు. ఆమె కూతురు 18 సంవత్సరాల కరుణ మొన్న మార్చి నెలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ప్రస్తుతం ఇంటి దగ్గర ఖాళీగా ఉంటోంది. అయితే మాధవి భర్త శ్రీనివాస్, ఆమె కొడుకు విజయ్ ఉపాధి కోసం కాకినాడలో ఉంటున్నారు. అక్కడ ఓ హోటల్‌లో పనిచేస్తూ వారానికోసారి ఇంటికి వచ్చి వెళుతుంటారు.
అయితే శనివారం రాత్రి తల్లీకూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. సుత్తెతో వారిద్దరి తలలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో అనుమానస్పద కేసుగా ఫైల్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications