అక్రమ సంబంధం మోజులో... ఆ తల్లి ఎంత పని చేసింది... కన్న బిడ్డలనే...

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ తల్లి ప్రియుడితో పారిపోయేందుకు కడుపున పుట్టిన బిడ్డలనే కడతేర్చింది. ఆమెను, ఆమె ప్రియుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టిన సంఘటన చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలంలో వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని కవ్వంపల్లె గ్రామానికి చెందిన వివాహిత పవిత్ర భర్త ఉన్నా కూడా మరో యువకుడితో వివాహేతర సంబంధం సాగించింది. అంతటితో ఆగకుండా ప్రియుడితో కలిసి పరారైంది.

love-murder

విషయం తెలుసుకున్న ఆమె భర్త పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పవిత్రను వెతికి పట్టుకున్నారు. ఆమె ప్రియుడు వేమన్నకు కూడా తమదైన శైలిలో కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. అయినా పవిత్ర ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు.

రహస్యంగా తన ప్రియుడితో కలుస్తూ వచ్చింది. ఇటీవల అతడి సలహాతో తన ఇద్దరు బిడ్డలను ఇంట్లో ఉరివేసి చంపేసి ప్రియుడి వద్దకు పారిపోయింది. దీంతో పవిత్ర భర్త, కుటుంబీకులు బిడ్డలను చంపి పారిపోయిందంటూ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మళ్లీ వారికోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు పవిత్రను, ఆమె ప్రియుడు వేమన్నను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రియుడు వేమన్న కోసం.. తన బిడ్డలను తానే చంపానని విచారణలో పవిత్ర ఒప్పుకుంది. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A mother killed her own children to enjoy free life with his lover. This incident was happened in Kavampalle village of Ramakuppam Mandal of Chittor District. After murder she ranaway with her lover. But police traced them and bring back and arrested.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి