కొడుకు గొంతు కోసిన తల్లి, ఓ వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంతో ఓ కన్న తల్లి పేగును తెంచుకుని పుట్టిన కన్న బిడ్డను గొంతు కోసి హత మార్చింది. ఆ తర్వాత తాను కూడా గొంతు కొసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు.

నంద్యాలలో ఓ వ్యక్తి దారుణ హత్య

Mother murdered son often committed suicide attempt at Dharmavaram

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని నూనెపల్లెకు చెందిన గౌస్ అనే వ్యక్తిని అంజిమన్ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+