నిజాం మళ్లీ పుట్టాడనిపిస్తోంది: కేసీఆర్‌పై మోత్కుపల్లి

ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమన్న కేసీఆర్ ఇప్పుడు మాట తప్పుతున్నారని తెలంగాణ టీడీపీ నేత ఎల్ రమణ మండిపడ్డారు. మరో నెల రోజుల పాటు పని చేయను అనడానికి ఇదేమైనా కేసీఆర్ జాగీరా అని ప్రశ్నించారు. ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేయాల్సిందే అన్నారు.
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులు ఆందోళనగా ఉన్నారన్న ఆయన సమగ్ర సర్వే ఒక్కరోజులో అవ్వదని, వారం రోజులు గడువు ఇవ్వాలన్నారు. కేసీఆర్ మాటల్లో స్వర్గం, చేతుల్లో నరకం చూపిస్తున్నారన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే కరెంట్ కష్టాలన్నారు. అధికారంలోకి వస్తే 8 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ సొంత జిల్లాలోనే లాఠీలతో రైతులను కొట్టించారన్నారు.












Click it and Unblock the Notifications