వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ వల్లే తెలంగాణపై కేంద్రం జాప్యం: మోత్కుపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేయాలని కేంద్రం చూస్తోందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. అఖిల పక్ష సమావేశం పేరుతో కేంద్రం మళ్లీ డ్రామా ఆడుతోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

పిల్ల కాంగ్రెసు (వైయస్సార్ కాంగ్రెసు), తెరాసలను బలోపేతం చేసేందుకే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసు, తెరాస నాటకాలు ఆడుతున్నాయని ఆయన అన్నారు. ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో తమ పార్టీని దెబ్బ తీయలేవని ఆయన అన్నారు.

అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ అఖిల పక్ష సమావేశం ఎందుకు తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. విభజన చేసి సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఓట్లు, సీట్ల కోసం తాము తెలంగాణ అంశాన్ని వాడుకోవడానికి చూడడం లేదని ఆయన అన్నారు.

English summary
Telugudesam Telangana region MLA Mothkupalli Narasimhulu terms all party meeting on Telangana is a drama of Congress high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X