పవన్ కళ్యాణ్ అందుకే మద్దతివ్వట్లేదు, మా ఆలోచనా అదే: అఖిలప్రియ సోదరి
నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గంలో ఈ నెల 23న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తాడని పలువురు భావించారు.
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గంలో ఈ నెల 23న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తాడని పలువురు భావించారు.

పవన్ కళ్యాణ్‌పై మౌనికా రెడ్డి స్పందన
అయితే, తాను ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రకటించారు. పవన్ నిర్ణయంపై స్పందించిన భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికా రెడ్డి మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అభిమానుల మద్దతు మాకే
పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మౌనికా రెడ్డి అన్నారు. ఆయన అభిమానుల మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అందుకే పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం లేదు
ఈ రోజు పవన్ కళ్యాణ్ చెప్పిన దానితో తాను ఏకీభవిస్తున్నానని మౌనికా రెడ్డి అన్నారు. పవన్ పార్టీ ఇంకా విధివిధానాలు రూపొందించలేదని చెప్పారు. దీంతో పవన్ మద్దతు తెలపలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

పవన్ ఆలోచననే మాదీ
అయితే, శిల్పా మోహన్ రెడ్డి తొమ్మిదేళ్లు మంత్రిగా ఉన్నారని, నంద్యాల ప్రజలకు ఆయన ఏం చేశారో పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని, తమ కుటుంబానిది కూడా అదే దృక్పథం అన్నారు.












Click it and Unblock the Notifications