నా ప్రయత్నం ఫలించలేదు- పార్టీ మార్పుపై తేల్చేసిన ఆదాల..!!
నెల్లూరు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల వేళ వైసీపీలో సీనియర్ల సీట్ల వ్యవహారంలో అనిశ్చితి కొనసాగుతోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్దిగా ఖాయమైన తరువాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మార్పు ఆలోచన చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మార్పు పైనా ప్రచారం మొదలైంది. మాగుంట, వేమిరెడ్డితో ఆదాల సమావేశమయ్యారు. పార్టీ మార్పు పై స్పష్టత ఇచ్చారు. నెల్లూరు లో వైసీపీ అభ్యర్దుల మార్పు ఖాయంగా కనిపిస్తోంది.
నెల్లూరు రాజకీయం : నెల్లూరు ఎంపీ అభ్యర్దిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ ఖరారు చేసారు. తాను ఎంపీగా పోటీ చేయాంటే మూడు స్థానాల్లో అభ్యర్దులను మార్చాలని తొలుత వేమిరెడ్డి కోరారు. నెల్లూరు సిటీ స్థానం నుంచి అనిల్ ను నర్సరావు పేట ఎంపీగా మార్పు చేసారు. అక్కడ ఖలీల్ ను అభ్యర్దిగా ప్రకటించారు. ఈ ఎంపిక వేమిరెడ్డికి నచ్చలేదు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. అదే సమయంలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంటకు జగన్ సీటు నిరాకరించారు. వీరిద్దిరితో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. ఆదాల ప్రస్తుతం వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు.

టీడీపీ వైపు వేమిరెడ్డి : వేమిరెడ్డితో పాటుగా ఆదాల కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం పైన ఆయన స్పందించారు. తాను పార్టీ మారే అవకాశం లేదని ఆదాల క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నుంచే పోటీ చేస్తున్నానని స్పష్టం చేసారు. అయితే, వేమిరెడ్డి ప్రస్తుతం టీడీపీతో టచ్ లోకి వెళ్లటంతో ఆదాలను తిరిగి ఎంపీగా పోటీ చేయిస్తారా.. నెల్లూరు రూరల్ నుంచే కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు మా గుంట శ్రీనివాసులు రెడ్డితో చర్చలు జరిపానని వెల్లడించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం మనస్థాపానికి గురయ్యారన్నారు. ఆయనను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించానని, తన ప్రయత్నం ఫలించలేదని వివరించారు. అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పానన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నారని వివరించారు.

మార్పులు - చేర్పులు : దీంతో, ఇప్పుడు వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లటం ఖాయమైతే జిల్లాలో వైసీపీ సీట్లలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. వేమిరెడ్డి ఈ సారి టీడీపీ ఎంపీ అభ్యర్దిగా, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కోవూరు లేదా సర్వేపల్లి నుంచి పోటీ దిగుతారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ప్రస్తుత ఎంపీగా ఆదాల పేరును తిరిగి పార్లమెంట్ కు పరిశీలించే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ కు అప్పుడు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి ని బరిలోకి దించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆదాల ను నెల్లూరు రూరల్ లోనే కొనసాగిస్తే ఎంపీగా సుధాకర్ రెడ్డి లేదా మేకపాటి విక్రమ్ రెడ్డిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారని సమాచారం. నెల్లూరు జిల్లాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications