Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివేకా హత్య కేసు - అవినాష్ రెడ్డి అనూహ్య నిర్ణయం..!!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసు విచారణ పూర్తి చేయటానికి సుప్రీంకోర్టు సీబీఐకి నెల రోజుల సమయం ఇచ్చింది. ఇదే సమయంలో విచారణకు కొత్తగా సిట్ ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయాల సమయంలోనే అటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్​ ఉపసంహరించుకున్నారు. దీంతో..ఈ వరుస పరిణామాలతో వివేకా కేసు మరింత ఆసక్తిగా మారుతోంది.

వైఎస్ వివేకా కేసు విచారణ ఆలస్యంపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిబిఐ డిఐజి కెఆర్‌ చౌరాసియా పర్యవేక్షణలో కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను సుప్రీంకోర్టు బుధవారం ఏర్పాటు చేసింది. ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తొలగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ దర్యాప్తు వేగంగా సాగటం లేదని, విచారణ అధికారి మార్చాలని కోరుతూ ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టేందుకు ఏప్రిల్‌ 30లోగా దర్యాప్తును ముగించాలని స్పష్టం చేసింది.

MP Avinash Reddy Withdraws his petition in YS viveka case amid Surpeme Appoints new SIT

మరో వైపు కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రీ వద్ద పెండింగ్​లో ఉన్న పిటిషన్‌ను అవినాష్ రెడ్డి న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అవినాష్​రెడ్డి పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో ఇప్పటికే మూడు సార్లు ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనే అవినాశ్ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీనికి సంబంధించి హైకోర్టు నిర్ణయం ప్రకటించింది. ఇటు సుప్రీంకోర్టు వివేకా కేసు విచారణకు గడువు డిసైడ్ చేయటం..అటు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్​ ఉపసంహరించుకోవటం..కొత్త సిట్ రంగంలోకి దిగటంతో ఇప్పుడు ఈ కేసు పరిణామాలు మొత్తంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+