కొలికపూడి Vs చిన్ని వివాదంలో కొత్త మలుపు, ఇక ఫైనల్..!!
టీడీపీలో తిరువూరు పంచాయితీ కొత్త మలుపు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు ఇద్దరు నేతలు హాజరయ్యారు. ఎవరి వాదన వారు వినిపించారు. తన నియోజకవర్గంలో ఎంపీకి పని ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎంపీ పైన చేసిన ఆరోపణల పైనా ఆధారాలు సమర్పించారు. అటు ఎంపీ తాను చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. కమిటీ ఈ వివాదం పైన నివేదిక సమర్పించనుంది. కొలికపూడి ఇచ్చిన ఆధారాలతో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కొలికపూడి.. ఎంపీ చిన్నికి క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు వచ్చింది. ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ తమ వాదనలను వినిపించారు. తమ వైఖరులను పునరుద్ఘాటించారు. కొలికపూడి ఈ సమయంలోనూ ఎంపీ తీరు పైన ఫిర్యాదు చేసారు. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీకి ఏం పని? ఆయన తన నియోజక వర్గంలో అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని... వచ్చే ఎన్నికల్లో నాకు సీటు లేదని చెబుతున్నా రని చెప్పినట్లు సమాచారం. ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుంటే తానూ మాట్లాడనని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, పార్టీకి నష్టం కలిగించేలా తాను గీతదాటి వ్యవహరించలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టంచేశారు.

ఈ ఇద్దరి వివాదం పైన చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. క్రమశిక్షణా కమిటీ ఇద్దరితో మాట్లాడి నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో.. ముందుగా కొలికపూడి వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోపాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనూరాధ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. నాలుగు గంటలపాటు తన వాదనలు వినిపించారు. నివేదిక రూపంలో కమిటీకి అందజేశారు.
చిన్నిపై తాను చేసిన ఆరోపణ లకు సంబంధించిన ఆధారాలను క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచానని తెలిపారు. వారు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు, వివరణ ఇచ్చానన్నారు. వివాదంపై పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. చిన్ని సైతం తన వాదన వినిపించారు. వ్యక్తిగత ఎజెండాలతో పార్టీని నాశనం చేయాలనుకునే వారి విషయంలో నేను కఠినంగా ఉండాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో.. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక పైన చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications