చదువుతో ఏదైనా సాధ్యం: పేపర్‌బాయ్‌గా పనిచేశానన్న ఎంపీ గల్లా జయదేవ్
అమరావతి: చదువుకు పేదరికం అడ్డంకి కాదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలైన మందడం, వెలగపూడి, రాయపూడిలో నూతనంగా నిర్మితమైన అదనపు తరగతి గదులను స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలసి సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మందడం, రాయపూడిలో విద్యార్ధుల సమావేశంలో మాట్లాడుతూ చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. అమెరికాలో ఐదో తరగతి చదువుతూనే తాను పేపరు బాయ్, ఆ తర్వాత బట్టల షాపులో పనిచేశానని చెప్పారు. కష్టపడటం నేర్చుకుంటే విజయాలు వాటంతట అవే సొంతమవుతాయన్నారు.

మీ చదువులు పూర్తయ్యే సరికే రాజధాని అమరావతిలో మంచి అవకాశాలు ఎదురు చూస్తుంటాయని విద్యార్ధలకు ఆయన తెలిపారు. దీంతో మీరు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు తమ గోడుని ఎంపీకి వినిపించారు.
అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని విద్యార్థినికి సూచించారు. ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications