శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై తిరుపతి ఎంపీ అత్యవసర సమీక్ష
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. తొమ్మిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 16 నుంచి 12 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. శనివారం 66,590 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,052 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. టీటీడీకి హుండీ ద్వారా 3.37 కోట్ల రూపాయల ఆదాయం అందింది.

సోమవారం నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతోన్నాయి. కన్నులపండువగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోన్నారు టీటీడీ అధికారులు. ఈ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టనుంది టీటీడీ.
ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు తిరుపతి, తిరుమలకు విచ్చేసే అవకాశం ఉందని, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను కోరారు.
భక్తుల సౌకర్యాల విషయంలో ఎలాంటి అజాగ్రత్త గానీ, నిర్లక్ష్యం గానీ ప్రదర్శించవద్దని సూచించారు. 1,400 బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవ నాడు 2,600 సర్వీసులు అందుబాటులో తీసుకురానున్నట్లు చెప్పారు.
తిరుపతికి అదనంగా రైళ్లను నడిపించబోతోన్నామని, వీటితోపాటు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలను జోడించనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. పర్యాటక సంస్థ ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల కోసం వసతి గృహాలను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆ సంస్థ అధికారులు చెప్పారు.
-
తిరుమల ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే బిగ్ అప్డేట్, కొత్తగా అందుబాటులలోకి..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications