ఎంపీ జేసీ సంచలన వ్యాఖ్యలు, 'ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పువు'
అమరావతి: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేల అవసరం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం ఉంటే మంచిదన్నారు.
ఆదేశాలపై క్రమశిక్షణ చర్యలు: మంత్రి శిద్దా
రాష్ట్రవ్యాప్తంగా జనవరి నెలాఖరుకు రహదారులపై గుంతలను పూడ్చివేయాలని అధికారులను ఆదేశించినట్లు ఏపీ రహదారులు, భవనాల శాఖమంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. సోమవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన రహదారుల నిర్మాణానికి రూ. 10 వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు.
గుంతలను పూడ్చివేయకుండా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి శిద్ధా హెచ్చరించారు.

నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తే డీలర్లపై చర్యలు: మంత్రి సునీత
కర్నూలు జిల్లాలోని సివిల్ సప్లై గౌడౌన్‌లను మంత్రి పరిటాల సునీత సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పాస్ విధానంలో టెక్నికల్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికి చంద్రన్న కానుకలు అందేలా చూస్తామన్నారు. నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
ఇసుక తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలపై హైపవర్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యపై దృష్టి పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications