హామీ: మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎంపి కవిత
నిజామాబాద్: మార్నింగ్ చేస్తూ.. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత. శుక్రవారం ఉదయం నిజామాబాద్‌లోని ఒకటవ డివిజన్‌లో మార్నింగ్ వాక్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి అవసరాలు, పార్కుల ఏర్పాటు, ఇతర సమస్యల గురించి ఆమె ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎంపి కవిత వారికి హామీ ఇచ్చారు.
సచివాలయాన్ని తరలించాలన్న నిర్ణయాన్ని విపక్షాలన్నీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని కవిత ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉన్నప్పుడే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

జోగినులకు కవిత భరోసా
నిజామాబాద్ జిల్లాలో ఉన్న జోగినులందరికీ న్యాయం చేసేందుకు పూర్తి బాధ్యత వహిస్తానని ఎంపి కవిత భరోసా ఇచ్చారు. వర్నిలోని సంఘ వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన జోగినులు తమకు పింఛన్లు ఇప్పించాలని, నెల రోజులుగా కరెంట్ కోత విధించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు కవితకు తెలిపారు.
కవితను జోగినులు చుట్టుముట్టగా కూర్చోబెట్టి మైక్‌లో మాట్లాడి పూర్తిగా వివరించారు. జోగినులకు పింఛన్లు మంజూరు చేయిస్తామని, ఆందోళన చెందవద్దని సముదాయించారు. దీంతో జోగినులు చప్పట్లతో సభా వేదిక నుంచి సంతోషంగా నిష్క్రమించారు.












Click it and Unblock the Notifications