రాజ్ కసిరెడ్డితో వ్యాపారాలు నిజమే - చిన్ని క్లారిటీ, సీబీఐకు లేఖ..!!
కేశినేని బ్రదర్స్ వివాదం కొత్త టర్న్ తీసుకుంటోంది. ఎంపీ చిన్నికి మద్యం లిక్కర్ లో ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్న కేసిరెడ్డి రాజ్ తో ఉన్న సంబంధాల గురించి కేశినేని నాని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ ఆరోపణల పైన ఎంపీ చిన్ని క్లారిటీ ఇచ్చారు. తనకు రాజ్ కేసిరెడ్డితో జరిగిన వ్యాపార లావా దేవీల గరించి వివరించారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల గురించి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సీబీఐకి లేఖ రాస్తున్నట్లు చిన్ని పేర్కొన్నారు.
రాజ్ కసిరెడ్డితో
కేశినేని నాని చేసిన ఆరోపణల పైన ఎంపీ.. ఆయన సోదరుడు కేశినేని చిన్ని స్పందించారు. రాజ్ కసిరెడ్డితో తనకు పరిచయం ఉందని.. నాలుగుసార్లు ఆయనను కలిశానని గుర్తుచేశారు. ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టామని దానిని డెవలప్‌మెంట్ చేద్దామని అనుకున్నామని చెప్పారు. ఆ కంపెనీ డెవలప్‌మెంట్‌తో సహా ఆరునెలలు అన్నీ ఖర్చులు తానే పెట్టానని వెల్లడించారు. కాగా , జగన్మోహన్ రెడ్డితో రాజ్ కసిరెడ్డికి సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి రాజ్ కసిరెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లిక్కర్ కేసు డైవర్షన్
మద్యం కుంభకోణం పైనా చిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రూ 3200 కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందని.. అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వ్యక్తేనని ఎంపీ కేశినేని ఆరోపిం చారు. ఆ ప్యాలెస్‌లో రాజ్ కసిరెడ్డితో సహా నలుగురికే ఎంట్రీ ఉందని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి ఐదుగురు సమావేశం అయ్యారని చెప్పారు. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని ఆరోపించారు. కేశినేని నానికి చెందిన ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలోని రెండు కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లుగా వచ్చిన వార్తలను నిగ్గు తేల్చాలని.. అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని పేర్కొన్నారు. తన కుటుంబంలో ఐదు, ఆరు కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అన్నీ లీగల్‌గానే ఉన్నాయని స్పష్టం చేశారు.
24 గంటల సమయం
తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సీబీఐకి లేఖ రాస్తున్నానని అన్నారు. రూ. 3600 కోట్లు దోచేసిన జగన్ సీబీఐ విచారణకు సిద్ధమా అని చిన్ని సవాల్ చేసారు. కేశినేని నాని, జగన్‌కు 24 గంటలు సమయం ఇస్తున్నాఆ ఆరోపణలను నిరూపించాలని ఎంపీ చిన్ని డిమాండ్ చేసారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications