సొంత పార్టీ నేతలకు ఎంపీ కేశినేని షాక్ - ఎన్నికల వేళ, కీలక నియోజకవర్గంలో..!!
టీడీపీ నేతలకు ఎంపీ కేశినేని షాక్ లు ఇస్తూనే ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కొంత కాలంగా కినుక వహించారు. సోదరుడుతో వచ్చిన విభేదాల నడుమ కొందరు టీడీపీ నేతలు తమ మధ్య ఉన్న గ్యాప్ ను అనకూలంగా మలచుకుంటున్నారని కేశినేని ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో విజయవాడ పశ్చిమం, మైలవరం లో తన పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగర టీడీపీ లో కేశినేని నాని అనుకూల వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఇదే సమయంలో మరోసారి కేశినేని చర్చల్లో నిలిచారు.
క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో నందిగామ కీలక నియోజకవర్గం. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ తంగిరాల సౌమ్య వర్సస్ వైసీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తాజాగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఎంపీ కేశినేని నానిని కూడా ఆహ్వానించారు. ఎంపీ, ఎమ్మెల్యేతో పాటుగా రెండు పార్టీల నేతలు కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ను ఎంపీ కేశినేని ప్రత్యేకంగా అభినందించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పని చేస్తున్నారని కితాబిచ్చారు.

అదే సమయంలో తామిద్దరం వేర్వేరు పార్టీలు అయినా ప్రజా సమస్యల విషయంలో కలిసి పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజకీయాలు ఎన్నికల వరకు పరిమితం కావాలని, మిగిలిన సమయాల్లో ప్రజా సమస్యలే అజెండాగా పని చేయాలని ఎంపీ కేశినేని నాని సూచించారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యే పని తీరును తమ పార్టీ ఎంపీ ప్రశంసించటం స్థానిక టీడీపీ నేతలకు రచించటం లేదు. స్థానికంగా టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పని తీరును ప్రశంసిస్తూ తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు చేయటం తమకు నష్టం చేస్తుందనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నందిగామ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు ఇద్దరూ వసూలు బ్రదర్స్ అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో కేశినేని నాని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం వారికి మింగుడు పడటం లేదు. ఎంపీ కేశినేని తమ పార్టీలు వేరు..అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నామని చెప్పినా.. ఎమ్మెల్యే పని తీరును ప్రశంసించటం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధత ఇప్పటికీ టీడీపీలో కొనసాగుతోంది. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు కారణమవుతున్నాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications