జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు సీజేకు రఘురామ లేఖ: ఓ ఎంపీ కూడా అంటూ విన్నపం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులను ఉద్దేశించి తమిళనాడు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం ఓ ఆంగ్ల దినపత్రికలోనూ ఇదే విషయమై ఆర్టికల్ రాశారని, బాధ్యతారాహిత్యమైన ఆయన వ్యాఖ్యలను తమ దృష్టికి తెస్తున్నట్లు రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.

గతంలో తమ పార్టీకి చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు ఇలాంటి ప్రకటనలు చేశారని, ఇప్పుడు జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని రఘురామ పేర్కొన్నారు. దీని ద్వారా వ్యూహాత్మకంగా మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు.

MP Raghu Rama Krishnam Raju writes a letter to AP High Court CJ on justice chandru comments

వాస్తవానికి న్యాయ వ్యవస్థపై దూషణలు చేసినవారి జాబితాలో అధికార పార్టీకి చెందిన ఆ ఎంపీ పేరు కూడా ఉందని, అయితే ఇప్పటి వరకు ఆయనపై చర్యలు లేవని లేఖలో గుర్తు చేశారు రఘురామ కృష్ణరాజు. జస్టిస్ చంద్రు లాంటి వారి వ్యాఖ్యలు గౌరవనీయమైన సంస్థలపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. ఏపీ హైకోర్టుతో పాటు భారత న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా జరుగుతున్న ఈ కుట్రపై సుమోటాగా విచారణ ప్రారంభించాలని అభ్యర్థిస్తున్నట్లు రఘురామ తన లేఖలో కోరారు.

ఇది ఇలావుండగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు మొత్తాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించింది. కొన్ని ఘటనలు, కొందరు న్యాయమూర్తులపై అభ్యంతరం ఉంటే ఆ విషయం మేరకే పరిమితమై పోరాడాలి తప్ప.. హైకోర్టు మొత్తంపై నింద మోపడం సరికాదని పేర్కొంది.

ప్రజల ప్రాథమిక, మానవ హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టు ఆదేశాలిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో పోరాడాల్సి వస్తోందని జస్టిస్ చంద్రు అనడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితుల గురించి అవగాహన లేకుండా జస్టిస్ చంద్రు మాట్లాడినట్లుందని, ఆ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆయన వ్యాఖ్యలు నిరాధారమని, హైకోర్టు ప్రతిష్టను దిగజార్చడమేనని స్పష్టం చేసింది. జై భీమ్ సినిమాలో న్యాయవాదిగా కథనాయకుడి పాత్ర చూశాక.. జస్టిస్ చంద్రుపై గౌరవం పెరిగిందని, విజయవాడ వచ్చి ఏపీ హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలతో ఆయనపై గౌరవం పోయిందని జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+