జూ ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ అవ్వాలంటే - రఘురామ కీలక వ్యాఖ్యలు..!!
అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ భేటీ సమయం నుంచి అనేక రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి ఆహ్వానించారని..తారక్ బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారని.. రకరకాలుగా ప్రచారాలు సాగాయి. బీజేపీ రాజ్యసభ ఎంపీలు జీవీఎల్ నర్సింహారావు.. లక్ష్మణ్ హైదరాబాద్ కేంద్రంగా అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ మధ్య రాజకీయ చర్చలే జరిగాయని స్పష్టం చేసారు. తాజాగా.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలనానికి తెర తీసారు.

సోము వీర్రాజు వ్యాఖ్యలతో కొత్త చర్చ
జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ బాగా ఉందని.. బీజేపీ కోసం ఆయన సేవలు వినియోగించుకుంటామని చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీతో తమ విధానం మారలేదన్నారు. జనసేన మిత్రపక్షంగా ఉంటుందంటూ వివరించారు. దీంతో..మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్ పైన రకరకాలుగా చర్చలు మరోసారి మొదలయ్యాయి.
ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా పని చేసే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. అటువంటి నిర్ణయాలో కొన్ని వర్గాలతో పాటుగా అభిమానుల మద్దతు పోగొట్టుకుంటారని వ్యాఖ్యానించారు.

టీడీపీలోకి రావాలంటే 20 ఏళ్లు..
జూనియర్ కు రాజకీయంగా ఆసక్తి ఉంటే 20 ఏళ్ల తరువాత మాత్రమే టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో బీజేపీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అటు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం జూనియర్ సేవలు వినియోగించుకొనేందుకే అమిత్ షా నేరుగా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ - అమిత్ షా ఏం చేసినా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారని చెప్పారు. పాన్ ఇండియా హీరోగా ఉన్న జూనియర్ సేవలను బీజేపీ వాడుకొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

తారక్ స్పందిస్తేనే క్లారిటీ..
అయితే, టీడీపీ - బీజేపీ పొత్తు పైన వస్తున్న వార్తలను బీజేపీ ముఖ్య నేతలు ఖండిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాను పొత్తుల గురించి ఎక్కడా మాట్లాడటం లేదని...పార్టీ నేతలు కూడా ఎవరూ మాట్లాడవద్దని తేల్చి చెప్పారు. కానీ, అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా..అటు టీడీపీ నుంచి దీని తారక్ నుంచి మాత్రం స్పందన లేదు. జూ ఎన్టీఆర్ స్పష్టత ఇస్తేనే ఈ చర్చ పైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications