Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ పెళ్లిళ్లపై మాట్లాడటం నీచాతినీచం-ముందు ఆ సంగతి చూడండి-పేర్ని నానికి రఘురామ కౌంటర్

'రిపబ్లిక్' ఈవెంట్ వేదికగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్గిరాజేశాయి.నిన్న,మొన్నటిదాకా వైసీపీ వర్సెస్ టీడీపీగా నడిచిన రాజకీయం... ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. ఇరువైపుల నేతలు,ఇరువైపుల మద్దతుదారులు ఒకరిపై ఒకరు మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు.ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఘాటైన విమర్శలు,ఆరోపణలు తెరపైకి వచ్చాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ వివాదంలోకి ఎంటరయ్యారు. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా వైసీపీ నేతలపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.

అది నీచాతినీచమైన సంస్కృతి : రఘురామ

అది నీచాతినీచమైన సంస్కృతి : రఘురామ

'సినిమా ఇండస్ట్రీ చాలా సెన్సిటివ్.మంత్రి అనవసరపు మాటలు మాట్లాడారు.అనవసరంగా కుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది సరైనది కాదు.వైవాహిక సంస్కారాలు అంటూ వ్యక్తిగత జీవితాన్ని లాగడం సరికాదు.నేను ఆయన్ను వెనుకొస్తున్నానని కాదు.కొంతమందికి అదృష్టం ఉంటుంది... కొంతమందికి అదృష్టం ఉండదు... మనసులు కలవకపోతే విడిపోవడం నేరం కాదు.అదేదో పెద్ద ఘోరంలా, నేరంలా మాట్లాడటం సరికాదు.దీనివల్ల మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుంది.సిద్దాంతాల్లో లోపాలు ఉంటే చెబుదాం.అంతేగానీ వైవాహిక జీవితం గురించి మనకెందుకు.వైవాహిక సంస్కారాలు అనే వ్యాఖ్య చేయడం నీచాతినీచమైన సంస్కృతి. పేర్ని నాని,పోసాని కృష్ణమురళి ఎవరైనా కావొచ్చు... ఎదుటి వ్యక్తి వైవాహిక జీవితం గురించి ఎత్తిచూపేటప్పుడు ఒక వేలు అటువైపు చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయనే విషయం తెలుసుకోవాలి. అక్కర్లేని వ్యవహారాల్లో తలదూర్చి ఇండస్ట్రీ వాళ్లతో స్టేట్‌మెంట్లు ఇప్పించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.' అని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

'అందులో తప్పేముంది.. ముందు ఆ సంగతి చూడండి...'

'అందులో తప్పేముంది.. ముందు ఆ సంగతి చూడండి...'

విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడంలో తప్పేముందని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఇక్కడ ఎవడు పత్తిత్తు అంటూ ఫైర్ అయ్యారు. సినిమా టికెట్లకు సంబంధించిన వివాదమంతా పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ నుంచే మొదలైందన్నారు. ప్రభుత్వం ముందు రిజిస్ట్రేషన్ వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను చక్కదిద్దుకోకుండా, సినిమా టికెట్లు అమ్మడం కోసం పోర్టల్ ఏర్పాటు చేయడం అవసరమా? అని రఘురామ ప్రశ్నించారు. ప్రభుత్వం తరుపున ఆయా కేసుల్లో వాదించే న్యాయవాదులకు కోట్ల రూపాయాలు చెల్లిస్తున్నారని... ఆ దుబారాను అరికట్టకుండా ఇలాంటి వాడిపై పడటం సరికాదన్నారు.

పేర్ని నాని వర్సెస్ పవన్ కల్యాణ్...

పేర్ని నాని వర్సెస్ పవన్ కల్యాణ్...

రిపబ్లిక్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి పవన్‌కు గట్టి కౌంటర్స్ ఎదురైన సంగతి తెలిసిందే. సినీ నటుడు,రచయిత పోసాని కృష్ణమురళి సైతం పవన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్ కల్యాణ్... తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మంత్రి పేర్ని నాని నుంచి పవన్‌కు కౌంటర్ ఎదురైంది. జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న'మస్కా'రాలు అంటూ పేర్ని నాని ట్విట్ చేశారు. పవన్ వైవాహిక జీవితంపై పేర్ని నాని విమర్శలు చేయడంతో... ఇది సరైన పద్దతి కాదని పవన్ మద్దతుదారులు,రఘురామ లాంటి నేతలు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

    Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || Oneindia Telugu
    మళ్లీ ఎంటరైన పోసాని...

    మళ్లీ ఎంటరైన పోసాని...


    మరోవైపు మంగళవారం(సెప్టెంబర్ 28) మళ్లీ ప్రెస్ మీటింగ్ పెట్టిన పోసాని కృష్ణమురళి... పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి పచ్చి బూతులతో తనకు వేలాది మెసేజ్‌లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన పెళ్ళాం పిల్లలగురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని వాపోయారు. పవన్ కల్యాణ్‌కు తాను చాలా రెస్పెక్ట్ ఇచ్చానని చెప్పారు. 'ఒకసారి పవన్ నన్ను ఫోన్ చేసి నన్ను తిట్టాడు..షూటింగ్‌కు వస్తే.. నేను 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 కి వెళ్ళిపోతా.. పెద్ద హీరో కదా అని సాయంత్రం 6 తర్వాత కూడా మూడు గంటలు వేచి చూశా.. అయిన ఆయన రాలేదు... రాత్రి 10.30గంటలకు పవన్ నాకు ఫోన్ చేశాడు. ఏమండీ మేము పిచ్చళ్ళలా కనిపిస్తున్నామా.. చెప్పకుండా ఎలా వెళ్లిపోతారు... సినిమా అంటే ఏమనుకున్నారంటూ అరిచేశాడు. దానికి నేను కూడా గట్టిగానే సమాధానం చెప్పా.. ఆ తర్వాత నన్ను సినిమా నుంచి తీసేశాడు. అప్పటి నుంచి పవన్‌కు నా మీద కోపం.' అని పోసాని చెప్పుకొచ్చారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+