వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం సాధించారు, జగన్ చేతులెత్తేశారు, విచిత్రం: రామ్మోహన్‌నాయుడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బుధవారం మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బుధవారం మండిపడ్డారు. జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా అధికార పార్టీపై మండిపడుతున్నారు.

Recommended Video

Jagan Padayatra : అంత ఆస్థి ఉంచుకుని, రూ.1లక్ష కోసం కక్కుర్తి ఎందుకు ? | Oneindia Telugu

చక్రం తిప్పుతున్న పురంధేశ్వరి, బాబుకు షాక్: బీజేపీలోకి టీడీపీ కీలక నేత మోహన్చక్రం తిప్పుతున్న పురంధేశ్వరి, బాబుకు షాక్: బీజేపీలోకి టీడీపీ కీలక నేత మోహన్

రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి

రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి

ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను కూడా అధికార టీడీపీయే పోషిస్తోందని చెప్పారు. జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని చెప్పారు.

అసెంబ్లీలో పోరాడలేని జగన్ ఏం సాధిస్తారు

అసెంబ్లీలో పోరాడలేని జగన్ ఏం సాధిస్తారు

ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడలేని జగన్, అధికారంలోకి వచ్చి ఏం సాధిస్తారని రామ్మోహన్ నాయుడు నిలదీశారు. జగన్ ధ్యాస అంతా పదవి పైనే ఉందని మండిపడ్డారు. ఆయనకు ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన, చిత్తశుద్ధి లేదన్నారు.

నన్ను ముఖ్యమంత్రి చేయమని చెబుతున్నారు కానీ

నన్ను ముఖ్యమంత్రి చేయమని చెబుతున్నారు కానీ

జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం ఉద్దేశించినది కాదని, కేవలం పదవిపై ఉన్న ఆరాటంతోనే చేపట్టారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ప్రజలు వినతులు ఇచ్చే సమయంలో తనను సీఎంను చేయాలని, పరిష్కరిస్తానని చెప్పడం ద్వారా పదవి కోసమే పాదయాత్ర చేపట్టారన్న విషయం తేలిపోయిందన్నారు.

రోడ్ల విస్తరణపై రామ్మోహన్ నాయుడు

రోడ్ల విస్తరణపై రామ్మోహన్ నాయుడు

రోడ్ల విస్తరణ గురించి మాట్లాడుతూ.. పాతపట్నం మీదుగా 326ఏ జాతీయ రహదారి విస్తరణ పనుల విషయంలో స్థానికంగా ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు బైపాస్‌ రహదారి నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు. రోడ్డు విస్తరణ వల్ల ప్రతిష్ఠాత్మక నీలమణి దుర్గమ్మ ఆలయం, విద్యాసంస్థలు, పలు వ్యాపార సంస్థలకు నష్టం కలుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బైపాస్‌ రహదారి చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.

English summary
Srikakulam MP Rammohan Naidu on Wednesday fired at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his Praja Sanklpa Yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X