శివాజీ నాలుక కోస్తానన్న ఎంపీ శివప్రసాద్.. మరోసారి ఆ మాటెత్తవద్దని వార్నింగ్
చిత్తూరు : ప్రత్యేక హోదాపై పోరాడుతున్న సినీనటుడు శివాజీకి టీడీపీ నుంచి గట్టి కౌంటర్ ఎదురవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీ ఎంపీలను టార్గెట్ చేస్తూ.. శివాజీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ తాజాగా శివాజీకి హెచ్చరికలు జారీ చేశారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్.
కేంద్రమంత్రి సుజనాచౌదరిని సీఎం తొత్తు అని శివాజీ విమర్శించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ.. ఎంపీ శివప్రసాద్ నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఏవిధంగా పోరాడుతున్నారో శివాజీ తెలుసుకోవాలన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు శివప్రసాద్. 'మరోసారి సీఎం, సుజనా చౌదరి మాటెత్తితే నాలుక కోస్తా' అంటూ.. శివాజీని హెచ్చరించారాయన.

చంద్రబాబు ఆలోచనలను ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులకు తెలియజేస్తూ.. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న సుజనా చౌదరిని సీఎం తొత్తు అంటూ విమర్శించడం ఏమాత్రం సరైంది కాదన్నారు శివప్రసాద్. ఇప్పటికైనా వ్యవహారశైలిలో మార్పు లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications