గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గల్లా ఎఫెక్ట్: టిడిపి నేతల మధ్య స్పైడర్ చిచ్చు, ఎమ్మెల్యేపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు తీసుకు వచ్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదం చెలరేగింది.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ప్రిన్స్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు తీసుకు వచ్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదం చెలరేగింది.

గల్లా జయదేవ్ ఫోటోలతో స్పైడర్ ఫ్లెక్సీ

గల్లా జయదేవ్ ఫోటోలతో స్పైడర్ ఫ్లెక్సీ

రెండు రోజుల క్రితం మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ ఫోటోలతో అభిమానులు స్పైడర్ సినిమాకు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో

ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో

అయితే, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపాలిటి సిబ్బంది ఈ ప్లెక్సీలను తొలగించింది. అందులో ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఈ ఫ్లెక్సీలు తొలగించారని తెలుస్తోంది.

టిడిపి ఎమ్మెల్యే తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం

టిడిపి ఎమ్మెల్యే తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం

ఈ విషయమై ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయం నుంచి ఫోన్ చేసినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో సదరు ఎమ్మెల్యే తీరుపై గల్లా జయదేవ్ వర్గీయులు, మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను ఎమ్మెల్యే ఇలాగే వ్యవహరించారంటున్నారు.

చంద్రబాబుకు ఫిర్యాదు చేయనున్న ఎంపీ వర్గం

చంద్రబాబుకు ఫిర్యాదు చేయనున్న ఎంపీ వర్గం

సదరు ఎమ్మెల్యే పైన ఎంపీ వర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయాలని ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు స్పైడర్ సినిమాపై తప్పుడు రివ్యూలు రాస్తున్నారని మహేష్ బాబు అభిమానులు తిరుపతిలో ధర్నా చేశారు.

English summary
MP versus MLA over Super Star Mahesh Babu's spyder film flexi in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X