ఆకాశం నుంచి ఊడిపడలేదు - చిరంజీవికి సాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!!
మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల వివాదం కొత్త టర్న్ తీసుకుంది. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు సీరియస్ గా స్పందించారు. తమ్ముడు కోసమే చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేసారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో అసలు చిరంజీవి మాట్లాడిన పూర్తి ప్రసంగం వీడియో బయటకు వచ్చింది. అందులో చిరంజీవి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై విజయ సాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
చిరంజీవి వ్యాఖ్యలతో : చిరంజీవి వాల్తేరు వీరయ్య వేడుకలో చేసిన ప్రసంగంలో సినిమా హీరో చిరంజీవి వాల్తేరు వీరయ్య వేడుకలో సినిమా వాళ్లకు ఎక్కువ పారితోషకాలు ఇస్తున్నారని పార్లమెంట్ లో పెద్దల సభలో మాట్లాడుతున్నారని , వాళ్లకేమీ పనీ పాట లేదా అనిపిస్తోందంటే చిరంజీవి కామెంట్ చేసారు. తాము ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి వస్తుందని చెప్పారు. అంతమందికి కడుపునిండా తిండి దొరుకుందున్నారు.

వాళ్ల కుటుంబాలు సుఖంగా ఉంటాయన్నారు. సినిమాలు చేస్తున్నామంటే వ్యాపారం జరుగుతుంది కాబట్టేనని చెప్పుకొచ్చారు. అందుకే తమకు డబ్బులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తున్నారని వివరించారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బు మీద డబ్బు వస్తుంది కాదని చిరంజీవి స్పష్టం చేసారు.
సాయిరెడ్డి వ్యాఖ్యల ప్రస్తావన : తాను రాజకీయాలు చూశానని. .సినిమానీ చూశానని చిరంజీవి చెప్పుకొచ్చారు. పెద్ద పెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలని తప్ప..సినీ తారల పారితోషికాలు తీసుకోవటం తప్పు అంటూ దేవ వ్యాప్తంగా ఎత్తి చూపే ప్రయత్నాలు చేయవద్దని విన్నవించుకుంటున్నానని చిరంజీవి తన ప్రసంగంలో సూచించారు. చిరంజీవి వ్యాఖ్యలు తాజాగా రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి చేసిన ప్రసంగం లక్ష్యంగా చేసినట్లు స్పష్టం అవుతోంది.
రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో హీరోల రెమ్యునరేషన్ పైన జరిగిన చర్చలో సాయిరెడ్డి హీరోల పారితోషకాల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమా అంటే హీరో ఒక్కడే కాదని..హీరోలకు సింహ భాగం వెళ్లే విధానం మారాలని సూచించారు. ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడినట్లు స్పష్టం అవుతోంది.

వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.." అని చెప్పుకొచ్చారు. ఎక్కడా చిరంజీవి పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడు సాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీని పైన చిరంజీవి క్యాంప్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications