బాలకృష్ణ మాటిచ్చారు: విజయసాయిరెడ్డి
తారకరత్న మరణం తనను ఎంతగానో బాధించిందని.. సినీ రంగంలో ప్రతిఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని విజయసాయిరెడ్డి అన్నారు.
తారకరత్న మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు.. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే అవుదానుమకున్న తరుణంలో ఆయన లేరనే వార్త కలిచివేస్తోందంటున్నారు. తారకరత్న మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు తారకరత్న ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తనదేనని బాలకృష్ణ మాటిచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బాలయ్య నిర్ణయించిన సమయానికి తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయన్నారు.
తారకరత్న మరణం తనను ఎంతగానో బాధించిందని.. సినీ రంగంలో ప్రతిఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తన భర్త మృతితో అలేఖ్య రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, అలేఖ్య తారకరత్న మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఉదయం 9.00 గంటలకు ఫిలిం ఛాంబర్ కు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం తీసుకువస్తారని, మధ్యాహ్నం మూడుగంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. ఎంపీ విజయసాయి రెడ్డికి స్వయానా మరదలి కూతురు. విజయసాయి రెడ్డి భార్య.. తారకరత్న భార్య తల్లి అక్కాచెల్లెళ్లు. తారకరత్నకు విజయసాయిరెడ్డి మామయ్య అవుతారు. అందుకే ఉదయం నుంచి విజయసాయి రెడ్డి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications