Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశినాయన ఆశ్రమంలో నిలువనీడ కోల్పోయిన గోవులు

Kasinayana Ashram: కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం జ్యోతి మండలంలోని ప్రఖ్యాత అవధూత కాశినాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

మంత్రి నారా లోకేష్ స్పందించినా..

ఈ కూల్చివేతల పట్ల మంత్రి నారా లోకేష్ స్పందించినప్పటికీ- రాజకీయ రచ్చకు బ్రేకులు పడట్లేదు. ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున క్షమాపణ సైతం చెప్పారాయన. అధికారులపై చర్యలు తీసుకుంటామని, త్వరలో తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రాన్ని పునర్నిర్మిస్తానని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.

మాజీలు బారులు..

కూల్చివేతల తరువాత వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తోన్నారు. మాజీ ఎమ్మెల్యే, కడప జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల జ్యోతి క్షేత్రాన్ని సందర్శించారు.

Kasinayana

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సందర్శన..

తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధా, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, ఆదిత్య‌రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు.

బాధాక‌ర‌ం..

ఇటీవల జ్యోతిక్షేత్రంలో మహిళల స్నానపుగదులు, గోశాల, విశ్రాంతి గదులను అటవీశాఖ అధికారులు కూల్చివేసిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు. కాశినాయ‌న క్షేత్రంలో అట‌వీ అధికారులు కూల్చివేత‌లు చేప‌ట్ట‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు.

Take a Poll

తెలియదనడం..

కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు క్షేత్రంలో కూల్చివేత‌లు చేప‌ట్టారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తోన్న అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు దగ్గరుండి కూల్చివేతలను చేపడితే- ఆ విషయం తమకు తెలియదని అనడం చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గు చేటు అని అన్నారు. వినడానికే విడ్డూరంగా ఉందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేంద్ర మంత్రికి సైతం లేఖ..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ క్షేత్రానికి కావాల్సిన అటవీ అనుమతులు తక్షణమే ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి సైతం లేఖ రాశారని ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆదేశాలు ఇచ్చి మరీ కూల్చివేతలు చేపట్టారని ఆయన ఆరోపించారు.

బాధ్య‌త కూడా ఈ ప్ర‌భుత్వానిదే..

ఎంతో మంది భక్తుల మనోభావాలతో కూడుకున్న సున్నితమైన అంశమని, రాజకీయాలకు అతీతంగా ఈ క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. ఈ పుణ్యక్షేత్రానికి బస్సులను పునః ప్రారంభించడం మాత్రమే కాద‌ని, అట‌వీ శాఖ నుంచి అనుమ‌తులు తీసుకురావాల్సిన బాధ్య‌త కూడా ఈ ప్ర‌భుత్వానిదే చెప్పారు.

గోవులకు నిలువనీడ లేకుండా పోయింది..

కాశి నాయ‌న క్షేత్రానికి అటవీ అనుమతులు తీసుకురావడంలో ఈ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. గోశాలను కూల్చివేయడం వల్ల గోవులకు నిలువనీడ లేకుండా పోయిందని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలంలో ఈ పరిస్థితి చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు.

సీపీఎం సైతం..

కాశినాయన క్షేత్రంలో కూల్చివేతల పట్ల సీపీఎం సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సామాన్యులు, పేదలు, యాత్రికుల ఆకలిని తీరుస్తున్న అన్నదానసత్రం, ఇతర వసతులను ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చివేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ నిధులతో..

200 ఏళ్ళ చరిత్ర కలిగిన అన్నదాన సత్రాలను కాపాడి, అభివృద్ధికి ప్రోత్సాహించాల్సింది పోయి, సనాతన ధర్మం కాపాడతానని కంకణం కట్టుకున్న అటవీశాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ తన శాఖ ఆధ్వర్యంలోనే కూల్చివేతలకు పాల్పడడం దారుణమని అన్నారు. అటవీ శాఖ పరిధి నుండి ఆ ప్రాంతాన్ని మినహాయించి ప్రభుత్వ నిధులతో అన్నదాన సత్రాలను, ఇతర వసతులను పునర్నిర్మించాలని డిమాడ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+