ఎపిలో ఏ జిల్లాలో ఏపార్టీ: టిడిపి, జగన్‌పార్టీ నువ్వానేనా
హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీ కొంత ముందంజలో ఉన్నప్పటికీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో టిడిపి 590, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 490 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెసు పార్టీ 19 స్థానాలకే పరిమితమైంది.
శ్రీకాకుళం (79), విశాఖపట్నం (22), తూర్పు గోదావరి (62), పశ్చిమ గోదావరి (30), కృష్ణా (90), గుంటూరు (51), అనంతపురం (40) జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. కర్నూలు (122), కడప (81), చిత్తూరు (10) జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందంజలో ఉంది. గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ నెలకొంది.

మధ్యాహ్నం ఒకటిన్నర వరకు శ్రీకాకుళంలో టిడిపికి 79, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 34, విజయనగరం టిడిపికి 4, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 3, విశాఖపట్నంలో టిడిపికి 22, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 2, పశ్చిమ గోదావరిలో టిడిపికి 30, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 16, తూర్పు గోదావరిలో టిడిపికి 62, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 28, ప్రకాశంలో టిడిపికి 50, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 48, గుంటూరులో టిడిపికి 51, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 42, కృష్ణాలో టిడిపికి 90, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 52, ఎస్పీఎస్ నెల్లూరులో టిడిపికి 33, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 35, అనంతపురంలో టిడిపికి 40, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 15, కర్నూలులో టిడిపికి 90, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 122, కడపలో టిడిపికి 35, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 81, చిత్తూరులో టిడిపికి 5, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 10 స్థానాల్లో గెలుపొందాయి.
కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ ఎక్కడా సరైన పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం పంతొమ్మిది స్థానాలకే పరిమితమైంది. శ్రీకాకుళం, కృష్ణా, అనంతపురంలో ఒక్కోటి, ఎస్పీఎస్ నెల్లూరులో రెండు, కర్నూలు జిల్లాలో పన్నెండు గెలుచుకుంది.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications