MPTC- ZPTC ఎన్నికల పోలింగ్ వాయిదా, తాజా ముహూర్తం..!?
స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం ఆదేశాలతో ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేసింది. కొత్త తేదీలు ప్రకటించింది. పలు చోట్ల తిరిగి నామినేషన్లకు అవకాశం కల్పించింది. ఈ కారణంతో ముందుగా ప్రకటించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ తేదీల్లోనూ మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు కొత్త తేదీల పైనా స్పష్టత వస్తోంది. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన జారీ చేయనుంది.
స్థానిక ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు.. నిర్ణయాలు జరుగుతున్నాయి. సుప్రీం ఆదేశాలతో ఇప్పటికే ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కోసం కొన్ని ప్రాంతాల్లో తిరిగి అవకాశం కల్పించింది. ఈ రోజు, రేపు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్ నవంబర్ 1వ తేదీకి వాయిదా పడింది. నవంబర్ 3న ఫలితాలు ప్రకటించనున్నారు. కాగా.. ఈ తేదీల మార్పుతో ముందుగా ప్రకటించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ షెడ్యూల్ లోనూ మార్పులు జరగనున్నాయి. కొత్త తేదీలు ప్రకటించాల్సి ఉంది. వచ్చే నెల 3వ తేదీన జరగాల్సి ఉన్న పోలింగ్‌ను, 5వ తేదీకి మార్చే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్ ఓట్ల లెక్కింపు నవంబర్ 3వ తేదీకి ఫిక్స్ చేయటంతో ఆ రోజున జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు బందోబస్తుతో పాటుగా ఎన్నికల సిబ్బంది కేటాయింపు సమస్యగా మారుతుందని భావిస్తున్నారు.

ఎన్నికల సంఘం తుది కసరత్తు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీల వాయిదా పైన ఎన్నికల కమిషన్ చర్చించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3కి బదులు 5కి వాయిదా వేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీనిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు. నామినేషన్ల గడువు ముగుస్తుండటం తో ఈ తేదీల పైన ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేయనుంది. స్థానిక ఎన్నికల పైన వస్తున్న ఫిర్యాదులు.. తీసుకోవాల్సిన చర్యల పైన ఎన్నికల సంఘం సుదీర్ఘంగా చర్చించింది. రాజకీయంగా వస్తున్న ఫిర్యాదులు.. కోర్టు సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్లటం పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి నామినేషన్ల పైన నిర్ణయం ప్రకటించారు. ఇక.. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పైనా నిర్ణయం అధికారికం గా ప్రకటించేందుకు తుది కసరత్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications
