Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎట్టకేలకు కాపు నేత ముద్రగడ పద్మనాభం అరెస్టు, పరీక్షలకు నో

కాకినాడ:కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు గురువారం మధ్యాహ్నం ఎట్టకేలకు అరెస్టు చేశారు. అడ్డుకున్న కాపు నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైడ్రామా మధ్య ముద్రగడను అరెస్టు చేశారు. అడ్డుకున్న కార్యకర్తల పైన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ముద్రగడను అంబులెన్సులో తరలించారు.

అంతకుముందు...

కిర్లంపూడిలోని నత నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం పురుగుల మందు డబ్బాను పట్టుకుని తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు పంపుతున్నారు. ఆయన పక్కనే ఆయనసతీమణి, ఇతర కుటుంబ సభ్యులు కూర్చున్నారు. వారు తీవ్రంగా కలత చెందినట్లు కనిపిస్తున్నారు.

కుటుంబ సభ్యులు ఏడ్పే తక్కువ అన్నట్లుగా కూర్చున్నారు. భుజం తట్టి భార్యకు ముద్రగడ ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. పురుగుల మందు డబ్బాను చూపిస్తూ ఆయన పోలీసులను హెచ్చరిస్తున్నారు.

ఇంటి బయట ముద్రగడ అభిమానులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తలుపులు వేసుకుని ఇంట్లో ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పోలీసులతో ఆయన కిటికీలోంచి మాట్లాడారు. తుని ఘటనలో సమన్లు తీసుకుని సిఐడి అధికారులు వస్తే తాను అరెస్టవుతానని ఆయన కచ్చితంగా చెప్పారు. ఇతర కేసుల్లో అరెస్టయ్యేది లేదని చెప్పారు.

Muddragada says he will continue fast in jail

అమలాపురం పోలీసు స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై పోలీసులు ముద్రగడపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, తాను తుని ఘటనలో అయితేనే అరెస్టవుతానని ముద్రగడ మొండికేస్తున్నారు. కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.

పోలీసులను అడ్డుకునేందుకు ముద్రగడ అనుచరులు ప్రయత్నిస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీలు చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తనపై ఉన్న కేసుల వివరాలు చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ముద్రగడ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

తుని ఘటనలో అరెస్టులను నిరసిస్తూ కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష తలపెట్టిన నేపథ్యంలో గురువారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనను అరెస్టు చేస్తే జైల్లోనే దీక్ష చేస్తానని, తాను వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. అరెస్టు చేయాలని అడిగితే చేయకుండా దీక్షను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన అడిగారు.

గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులను ఎత్తివేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులకు పాల్పుడుతోందని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కి మోసం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిలా అబద్ధాలు చెప్పే అలవాటు తనకు లేదని అన్నారు.

Muddragada says he will continue fast in jail

అరెస్టుల పర్వం చాలా బాధాకరమని ఆయన అన్నారు. కాపు కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాకుండా వారిని రౌడీషీటర్లుగా ముద్ర వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, తన ప్రాణాలనైనా త్యాగం చేస్తానని, అన్నింటికీ తాను సిద్ధపడే ఉన్నానని ముద్రగడ అన్నారు.

తమ ఉద్యమానికి సంఘీభావం తెలిపినవారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. మీడియాపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని అడిగారు. కాపు జాతి హక్కుల కోసం తాను పోరాటం చేయడం తప్పా అని అడిగారు. కాపులను బీసీల్లో చేరుస్తామని తనతో ఇంతకు ముందు దీక్ష విరమింపజేశారని, రిజర్వేషన్ల కల్పనకు ఆగస్టు వరకు సమయం అడిగారని, అంతకన్నా ముందు చేయాలని తాను అడగడం లేదని అన్నారు. ప్రజలను కిర్లంపూడికి ఎందుకు రానివ్వడం లేదని అడిగారు.

తనపై 69 కేసులు పెట్టారని, అయినా తాను వెనకడుగు వేయబోనని స్పష్టం చేశారు. అరెస్టు చేయకుండా దీక్షను అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని, పారిపోనని అన్నారు. ఎవరు కూడా సంప్రదింపులకు, రాయబారాలకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కిర్లంపూడికి రావద్దని ఆయన కార్యకర్తలను కోరారు.

Muddragada says he will continue fast in jail

కాగా, ముద్రగడ దీక్ష నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. కిర్లంపూడిలో దాదాపు 3 వేల మంది పోలీసులు మోహరించారు. కిర్లంపూడికి వచ్చే వ్యక్తులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలను లోనికి అనుమతించడం లేదు. ఆర్టీసి బస్సులను మాత్రం అనుమతిస్తున్నారు.

కిటికీల ద్వారా ముద్రగడతో సంప్రదింపులు

ఎస్పీ రవి ప్రకాశ్ మాట్లాడుతూ.. తాము జిల్లాలో శాంతిభద్రతల కోసం కృషి చేస్తున్నామని, తమకు అందరూ సహకరించాలని చెప్పారు. జిల్లాలో దీక్షలకు, నిరసనలరకు ఎవరికీ అనుమతి లేదని చెప్పారు. కాగా, సీఐడీ పోలీసులు ముద్రగడతో కిటీకీల నుంచి సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... తనకు తుని ఘటనకు సంబంధించి తనకు చార్జీషీట్లు చూపించాలని, అరెస్టుల పైన సరైన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తనకు ఆధారాలు చూపించిన తర్వాతనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైద్య పరీక్షలకు నిరాకరణ

ముద్రగడను అరెస్టు చేసిన అనంతరం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన వైద్య పరీక్షలను నిరాకరించారు. ముద్రగడ అరెస్టు, ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. కాపులు తరలి వస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+