ఎన్టీఆర్ మొసలిలాంటోడు: యార్లగడ్డకు గాలి ఘాటు రిప్లై
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దివంగత నేత ఎన్టీ రామారావుపై చేసిన వ్యాఖ్యకు తెలుగుదేసంపార్టీ నాయకుడు యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ఘాటుగా జవాబు ఇచ్చారు.
ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం గురించి యార్లగడ్డ ఓ టీవీ షోలో వివరించారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కబురుపెడితే తాను కలవలేదని, సీఎంగా దిగిపోయిన మరుసటి రోజు ఢిల్లీలో కలిశానని చెప్పారు. తాను రాకపోవడంపై ఎన్టీఆర్ ప్రశ్నించారని దానికి తాను వివరణ ఇచ్చానని చెప్పారు.

ఎన్టీఆర్‌ను యార్లగడ్డ ఏమన్నారు..
నందమూరి తారకరామారావు తన అభిమాన నటుడని చెబుతూ అధికారంలో ఉన్న మీరు నీళ్లల్లో ఉన్న మొసలి లాంటి వారని, అడవిలో ఉన్న సింహం లాంటివారని ఎన్టీఆర్‌తో అన్నానని యార్లగడ్డ చెప్పారు. అప్పుడు తమకు ఏది చెప్పినా ఇబ్బంది అవుతుందని తనకేమో నోటి దురద ఎక్కువని, అందుకనే ఇప్పుడు వచ్చానని చెప్పగానే ఎన్టీఆర్ పకపకా నవ్వారని యార్లగడ్డ అన్నారు.

యార్లగడ్డపై మండిపడిన గాలి
ఎన్టీఆర్ను మొసలితో పోల్చిన యార్లగడ్డపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. ఎన్టీఆర్తో పోల్చుకునే అర్హత యార్లగడ్డ కు లేదని అన్నారు. సాహితీవేత్తగా, కవిగా యార్లగడ్డకు గుర్తింపు ఉందని,, అయితే ఎన్టీఆర్ ని వివాదాల్లోకి లాగొద్దని అన్నారు.

ఎన్టీఆర్‌ను మొసలితో పోలుస్తారా..
గొప్ప నటుడు, నాయకుడు అయిన ఎన్టీఆర్‌ను యార్లగడ్డ మొసలితో పోల్చడం బాధాకరమని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, తెలుగుజాతి కోసం అహర్నిశలు పాటుపడ్డ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పారు.

వారి గుండెల్లో నిద్రపోయారు.
హేమాహేమీలైన ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతల గుండెల్లో ఎన్టీఆర్ నిద్రపోయారుని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. అయితే ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి చెబుతున్న సందర్భంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మాత్రమే యార్లగడ్డ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications