ముద్రగడ దీక్ష.. ఫలించిందా? చక్రం తిప్పిన బాబు: చిరుపై ఎత్తుగడ, జగన్ కుదేలు
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం నిరాహార దీక్షను విరమించారు. కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఆయన నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన వెనుక వైసిపి అధినేత జగన్, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని అధికార టిడిపి విమర్శలు చేసింది.
అయితే, ఆయన దీక్షకు కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. శుక్రవారం ఉదయం ఆయన దీక్షను ప్రారంభించారు. ఆ రోజు నుంచి కాపులు యావత్తు ఆయనకు అండగా నిలబడ్డారు. కాపుల నుంచి ఆయనకు లభిస్తున్న మద్దతు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలుమార్లు అధికారికంగా, అనధికారికంగా ముద్రగడతో చర్చలు జరిపింది. ప్రభుత్వం సమయస్ఫూర్తితో వ్యవహరించి సోమవారం నాటికి ముద్రగడ దీక్షను విరమించింది. ముద్రగడ దీక్షను విరమింప చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం సఫలమైందని చెప్పవచ్చు.
ముద్రగడ దీక్ష నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపులను బీసీలలో చేర్చేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ గడువు మూడు నెలలు కావాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చల సమయంలో ఆయన 7 నెలల ఇరవై రోజులకు అంగీకరించారు.
తద్వారా ఈ విషయంలో ప్రభుత్వానిదే పైచేయి అని చెప్పవచ్చు. కాపులను బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిషన్‌కు 9 నెలల సమయం ఇచ్చారు. అది వేసి ఇప్పటికే నెల మీద పది రోజులు కావొస్తుంది. ఇప్పటికే నెల పది రోజులు అయినందున ప్రభుత్వం చెప్పిన గడువుకే ముద్రగడ అంగీకరించారు.

మంజునాథ కమిషన్‌కు నిర్దిష్ట కాలపరిమితిని ముద్రగడ ప్రభుత్వానికి చెప్పారు. దానికి ఏడు నెలలకు పైగా సమయం ప్రభుత్వం తీసుకుంటుంది. కాపు కార్పోరేషన్‌కు వచ్చిన దరఖాస్తులకు రుణాలు ఇచ్చేలా హామీ, కాపు కమిషన్లో ముద్రగడ సూచించిన వారికి ఒకరికి స్థానం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాల్లో ముద్రగడ విజయం సాధించారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వం సమయస్ఫూర్తితో వ్యవహరించిందని చెప్పవచ్చు. సోమవారం చిరంజీవి, దాసరి నారాయణ రావు, రఘువీరా రెడ్డి తదితరులు ముద్రగడ ఇంటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిని ఎక్కడికి అక్కడ అడ్డుకొని, టిడిపి నేతలు నేరుగా ముద్రగడవద్దకు వెళ్లి చర్చలు సఫలమయ్యేలా చేశారు.
ప్రతిపక్ష నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి ఉంటే చర్చలకు ఆటంకం కలిగే పరిస్థితి ఉండేది. అయితే, వారిని అడ్డుకొని, ముద్రగడతో చర్చలు జరపడం, టిడిపి నేతలు ముద్రగడతో చర్చలు జరుపుతూనే.. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చారు. తద్వారా ప్రతిపక్షాలకు చెక్ చెప్పారని భావించవచ్చు. ఇది జగన్‌కు షాకేనని అనవచ్చు.
మరోవైపు, ప్రభుత్వం మరోసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాటను విన్నదని చెప్పవచ్చు. అయితే, చర్చలకు ప్రభుత్వం ముందు నుంచే ప్లాన్ చేస్తున్నప్పటికీ.. నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ప్రభుత్వానికి సూచన చేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్











Click it and Unblock the Notifications