వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పవన్ కళ్యాణ్-బాబు కలిస్తే జీర్ణించుకోలేకపోతున్నారు, జగన్ మాటేమిటి'

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఓ మంచి పని కోసం కలిసి పని చేస్తుంటే ముద్రగడ పద్మనాభం ఓర్వలేకపోతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఓ మంచి పని కోసం కలిసి పని చేస్తుంటే కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఓర్వలేకపోతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు.

అదే నా భర్తను చంపేలా చేసింది: జగన్‌పై సునీత, గాజులు తొడుక్కోలేదు: జలీల్‌ఖాన్అదే నా భర్తను చంపేలా చేసింది: జగన్‌పై సునీత, గాజులు తొడుక్కోలేదు: జలీల్‌ఖాన్

చంద్రబాబు, పవన్ కలిసి పని చేస్తుంటే

చంద్రబాబు, పవన్ కలిసి పని చేస్తుంటే

కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లకు లేఖలు రాస్తున్న ముద్రగడ వైసిపి అధినేత జగన్‌కు ఎందుకు రాయలేదని నారాయణ ప్రశ్నించారు. కాపుల విషయంలో ముద్రగడ వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనమన్నారు. ఆయన చిత్తశుద్ధి ఇందులోనే తెలిసిపోతోందన్నారు.

Recommended Video

Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
జగన్ మాటేమిటి

జగన్ మాటేమిటి

వైసిపి ప్లీనరీలో కాపు రిజర్వేషన్ల ప్రస్తావనే లేదని, ప్లీనరీ తర్వాత కూడా ఇప్పటి వరకు జగన్‌ కనీసం కాపుల గురించి మాట్లాడలేదని నారాయణ గుర్తు చేశారు. మరి ఈ విషయాన్ని ముద్రగడ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. జగన్‌తో కలిసిపోయి ముద్రగడ కాపులకు రిజర్వేషన్ల అంశంపై రాద్ధాంతం చేస్తున్నారనే భావనను ఇది బలపరుస్తోందన్నారు.

చంద్రబాబును ఎందుకు కలవడం లేదు

చంద్రబాబును ఎందుకు కలవడం లేదు

పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏనాడైనా ముద్రగడకు కాపులు గుర్తుకు వచ్చారా అని నారాయణ నిలదీశారు. నిజంగా ముద్రగడ కాపుల సంక్షేమం కోరుకున్నవారైతే వారి సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించాలన్నారు. సీఎంను కలిసి చర్చించవచ్చు కదా, ఎందుకు చంద్రబాబును కలవడం లేదు అని ప్రశ్నించారు.

అనుమతిపై ముద్రగడ పట్టు

అనుమతిపై ముద్రగడ పట్టు

కాగా, ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఆయన మాత్రం తాను అనుమతి తీసుకునేది లేదని అంటున్నారు. గతంలో తుని సంఘటన నేపథ్యంలో అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు.

English summary
AP Minister Narayana said that Kapu leader Mudragada Padmanabham is not digesting Jana Sena chief Pawan Kalyan and AP CM Chandrababu Naidu friendship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X