Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ నిర్ణయాలు మీ చేతిలో లేవు, పర్మిషన్లు రావాలి- పవన్ కు ముద్రగడ లేఖ..!!

కాపు ఉద్యమ నేత ముద్రగడ జనసేనాని పవన్ కు బహిరంగ లేఖ రాసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. తనను కలుస్తానని పవన్ కలవకపోవటం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. 80 సీట్లు.. రెండేళ్ల సీఎం పదవి కోరాల్సిందని సూచించారు. జనసేన పోటీ చేస్తున్న 24 మందికి తన అవసరం రాకూడదని పేర్కొన్నారు. పవన్ తనను కలవటానికి ఇతరుల అనుమతి అవసరం అనుకుంటాని ముదగ్రడ లేఖలో పేర్కొన్నారు.

ముద్రగడ లేఖ: ఇప్పటి వరకు పొత్తులు, సీట్ల పైన హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కు వరుస లేఖలు రాసారు. ఇప్పుడు ముద్రగడ రాసిన లేఖలో పవన్ తనను కలుస్తానని సమాచారం పంపి, కలవక పోవటం పైన స్పందించారు. 2019 ఎన్నికల సమయంలోనూ పవన్ తనను కలుస్తానని చెప్పారని గుర్తు చేసారు.

Mudragada open letter for Pawan Kalyan over power and seat sharing with TDP

తాజాగా అయోధ్య రామాలయం ప్రారంభం తరువాత కలుస్తానని చెప్పారని వెల్లడించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా కలిసి వెళ్లాలని తాను నాడు నిర్ణయించుకున్నానని వివరించారు.యావత్ జాతి ఆకాంక్షల మేరకు గతం మరిచి కలిసి రావాలని భావించినా... పవన్ తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు.

సామాన్య విషయం కాదు: టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో టీడీపీ కేడర్ మొత్తం బయటకు రావటానికి భయపడగా..ఆ సమయంలో జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వటం సామన్యమైన విషయం కాదని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. ఆ తరువాతి కాలంలో వారి పరపతి పెరగటానికి పవన్ కారణమని విశ్లేషించారు.

ప్రజలంతా పవన్ ను గౌరవ ప్రదమైన స్థానంలో చూడాలని కోరుకున్నారని చెప్పుకొచ్చారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నించి 80 సీట్లు, రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ముందుగా పవన్ ను చేయమని కోరి ఉండాల్సిదని ముద్రగడ పేర్కొన్నారు. ఆ సాహసం చేయలేకోవటం బాధాకరమని ముద్రగడ లేఖలో అభిప్రాయపడ్డారు.

అవసరం రాదంటూ: 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయలేదని స్పష్టం చేసారు. తనకు ఆ పరిస్థితి రాకూడదని దేవుడిని ప్రతీ రోజు కోరుకుంటానన్నారు. పవన్ లాగా తనకు గ్లామర్ లేకపోవటంతో తాను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా గుర్తింపు వల్ల వస్తానని చెప్పి రాలేకపోయారని పేర్కొన్నారు.

పవన్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని..ఎన్నో చోట్ల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ ఎద్దేవా చేసారు. జనసేన పార్టీ పోటీ చేసే 24 స్థానాల్లో తన అవసరం రాదని, రాకూడదని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పవన్ కల్యాణ్ కు రాసిన లేఖలో స్పష్టం చేసిన ముద్రగడ ఆలి ద్ బెస్ట్ చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+