వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడకు షాక్: వారంపాటు హౌస్‌అరెస్ట్,‘ఇక్కడెందుకు జైల్లోనే పెట్టండి’

కాపు రిజర్వేషన్ల కోసం పోరాట చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఛలో అమరావతి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకుని 24 గంటల పాటు.

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: కాపు రిజర్వేషన్ల కోసం పోరాట చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఛలో అమరావతి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకుని 24 గంటల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే.

మళ్లీ అడ్డుకున్నారు..

మళ్లీ అడ్డుకున్నారు..

అయితే గురువారం మరోసారి పాదయాత్రను చేపట్టేందుకు ముద్రగడ ప్రయత్నించారు. ఉదయం ఇంటి నుంచి పాదయాత్రగా బయలుదేరిన ముద్రగడను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు.

ముద్రగడ గృహ నిర్బంధం: కిర్లంపూడిలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపుముద్రగడ గృహ నిర్బంధం: కిర్లంపూడిలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు

Recommended Video

Kapu Protesters in Andhra set train on fire demanding reservation
ఏడురోజులపాటు హౌస్ అరెస్ట్

ఏడురోజులపాటు హౌస్ అరెస్ట్

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏడు రోజుల పాటు గృహ నిర్భంధం చేస్తున్నట్లు ఓఎస్డీ రవిప్రకాశ్‌ రెడ్డి, ఏఎస్పీ నయిం అస్మిన్‌లు ఆయనకు తెలిపారు. హౌస్ అరెస్ట్ చేయడంతో ముద్రగడ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

జైల్లోనే పెట్టండి..

జైల్లోనే పెట్టండి..

ఏకంగా వారం రోజుల పాటు గృహ నిర్బంధమేంటని ముద్రగడ కూడా పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. రోజుల తరబడి గృహ నిర్బంధం చేసే బదులు జైల్లోనే పెట్టడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారి ఆదేశాలే..

వారి ఆదేశాలే..

తాము ఉన్నతాధికారుల ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నామని పోలీసులు ముద్రగడకు తెలిపారు. అనంతరం ముద్రగడ తన అనుచరులతో కలిసి ఇంటి లోపలికి వెళ్లిపోయారు. ముద్రగడ పిలుపుతో ఆయన ఇంటి వద్దకు కాపు రిజర్వేషన్ల మద్దతు కోరుతూ భారీగా జనం చేరుకున్నారు.

English summary
Former minister Mudragada padmanabham has been house arrested for a week from Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X