నాకు క్యాన్సరా..? వైసీపీలో తన పాత్ర పై తేల్చేసిన ముద్రగడ..!!
కాపు ఉద్యమ నేత ముద్రగడ కీలక అంశాలను వెల్లడించారు. తన కుమార్తె తాజాగా ముద్రగడకు క్యాన్సర్ వచ్చిందని.. కుమారుడు గిరి చికిత్సం అందించటం లేదంటూ సోషల్ మీడియా లో చేసి న పోస్టింగ్ సంచలనంగా మారింది. దీని పైన ముదగ్రడ స్పందించారు. తన కుమార్తె ప్రస్తావించిన అంశాల పైన లేఖ విడుదల చేసారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం తన చిన్న కుమారుడే అని చెప్పుకొచ్చారు. వైసీపీలో కొనసాగటం పైన ముద్రగడ క్లారిటీ ఇచ్చారు.
కూతురు క్రాంతి ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేసిన ముద్రగడ తన ఆనారోగ్య సమస్యల పైన వివరణ ఇచ్చారు. ఈమధ్య మా కుటుంబం పై ఒక కుటుంబం దాడి చేస్తుందని ముద్రగడ పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయని చెప్పుకొచ్చారు. తమ చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు.

తాను ఆరోగ్యంగా ఉన్నానంటే 100% తన చిన్న కొడుకు కారణమని ముద్రగడ వివరించారు. తన అబ్బాయిని దూరం చేస్తే వారి ఇంటికి చేరుతాను అనుకుంటు న్నారు.. అది ఈ జన్మకు జరగదని ముద్రగడ తన కుమార్తెకు తేల్చి చెప్పారు. వీరి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ముద్రగడ సీరియస్ అయ్యారు.
తనకు వయస్సు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవని ముద్రగడ తేల్చి చెప్పారు. తనను బంధించి ఉంచడం మానసికంగా హింసించడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు. మీకు దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయించి డబ్బా కొట్టుకోండంటూ ముద్రగడ సూచించారు. మీ అపాయింట్మెంట్లు చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతకకండంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను వైసీపీ కార్యక్రమాలకు హాజరవుతున్నానని.. నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమానులు.. ప్రజలను కలుస్తున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications