పవన్ మగాడు అయితే - ముద్రగడ సవాల్..!!
ఏపీ ఎన్నికల్లో గోదావరి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గోదావరి జిల్లాల్లో ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే వారికే విజయం దక్కుతుందనే నమ్మకం ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజకీయ వ్యూహాల ను అమలు చేస్తున్నారు. జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ వైసీపీ నుంచి పోటీలో ఉన్న వంగా గీతకు మద్దతుగా ముద్రగడ పద్మనాభం నిలిచారు. తాజాగా పవన్ పైన ముద్రగ సంచలన వ్యాఖ్యలు చేసారు. సవాల్ విసిరారు.
ముద్రగడ వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా కొద్ది రోజులుగా ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో మద్రగడ వైసీపీ తరపున ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొలుత జనసేనలో చేరాలని భావించిన ముద్రగడ ఆ తరువాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో వరుసగా పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ కు ముద్రగడ సవాల్ చేసారు. పవన్ కల్యాణ్ రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ మగాడు అయితే తన పైన నేరుగా మాట్లాడాలని సవాల్ చేసారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి ఇష్టానుసారం మాట్లాడటం సరి కాదని ముద్రగడ పేర్కొన్నారు.

నేరుగా మాట్లాడండి
తాను ఏమైనా మాట్లాడితే సైడ్ క్యారెక్టర్లతో కాకుండా పవన్ నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను తిట్టాలని సవాల్ చేసారు. తన పైన సూటిగా మాట్లాడాలని.. తనకు ప్రశ్నలు వేయాలని సూచించారు. తాను సమాధానం చెబుతానని..తిరిగి ప్రశ్నలు వేస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కోట్లు, లక్షలు ఖర్చు చేస్తున్నారని పవన్ అంటున్నారని..ప్రజలంతా అమ్ముడుపోతారానే కోణంలో మాట్లాడుతున్నారని ముద్రగడ వ్యాఖ్యానించారు. తెరచాటుగా తన పై మాట్లాడటం సరికాదన్నారు. పవన్ పట్టిన రాష్ట్రం తెలంగాణ అని.. రాష్ట్రం వేరు...మన రాష్ట్రం వేరని చెప్పిన పవన్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో పోటీ చేయటం ఏంటని ముద్రగడ ప్రశ్నించారు.

అప్పుడు ఏమైందీ పౌరుషం
హైదరాబాద్ లో అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, కోపం, పట్టుదల పవన్ కు ఏమయ్యాయని నిలదీసారు. అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేయటం ఏంటని వ్యాఖ్యానించారు. పవన్ తన ప్రసంగాల్లో రెచ్చిపోయి మాట్లాడటం సరి కాదన్నారు. ఇప్పటికే పవన్ చంద్రబాబు ఎస్టేట్ ను కాపాడేందుకే రాజకీయాల్లో ఉంటున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్దిచెప్పి ప్యాక్ చేసి పవన్ పార్టీని ఇంటికి పంపేయాలని ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఇక, పవన్ పైన విరుచుకుపడుతున్న ముద్రగడ గురించి పవన్ స్పందిస్తారా..ఏ విధంగా సమాధానం చెబుతారనేది ఇప్పుడు గోదావరి రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications