దీక్ష టైంలో పక్కనే విషం, పురుగుల మందు పెట్టుకున్నా: ముద్రగడ షాకింగ్
కిర్లంపూడి: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం షాకిచ్చారు! దీక్ష సమయంలో తాను పురుగుల మందు, పెట్రోలు, విషం పక్కనే పెట్టుకున్నానని, తన జాతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అలా చేశానని చెప్పారు. సోమవారం దీక్ష విరమణ అనంతరం మాట్లాడారు.
కాపులు మరోసారి రోడ్డెక్కే పరిస్థితిని సీఎం చంద్రబాబు తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. తన జాతి కోసం తాను దేనికైనా సిద్ధమని చెప్పారు. అందుకే దీక్ష సమయంలో పక్కనే విషం, పెట్రోల్ పెట్టుకున్నానని తెలిపారు. ఇదే ఆఖరి పోరాటం అనుకున్నానని చెప్పారు. ఇరవై ఏళ్లుకా తమ డిమాండును పక్కన పెట్టారన్నారు.

ముద్రగడ ఇంటికి భారీగా అభిమానులు
ముద్రగడ దీక్ష విరమించిన నేపథ్యంలో ఆయన అభిమానులు, కాపులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి తరలి వచ్చారు. ఆయనకు అభినందనలు తెలిపారు. అభిమానులు ఆయన ఇంటి ముందు, వివిధ ప్రాంతాల్లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications