ముద్రగడ కాపు గర్జన ఎఫెక్ట్: ఆఫీస్‌ల వద్ద క్యూ కట్టిన కాపులు
కడప: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు గర్జన సభ ఫలితాలు చూపిస్తున్నట్లుంది. కాపులను బీసీల్లో చేర్చాలంటూ 31న తుని సమీపంలో ముద్రగడ భారీ బహిరంగ సభను నిర్వహించనున్న తరుణంలో కాపులు చేజారకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇందులో భాగంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి, ఆ సంస్థ ద్వారా వందకోట్ల రూపాయల విడుదల చేసింది. కాపులను బిసిల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా జస్టిస్ మంజునాథ కమిషన్‌ను కూడా నియమించింది. కాపుల నుంచి దరఖాస్తున్న స్వీకరించి అర్హులైన వారికి తక్షణమే లక్షరూపాయల వంతున మంజూరు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీచేసింది.

అందుకుగాను కడప జిల్లాకు రూ.14కోట్లు, అనంతపురం జిల్లాకు 15కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీలకు కూడా లేనివిధంగా ఈ రుణాలను 50శాతం సబ్సిడీతో ఇవ్వాలని మార్గదర్శకాలు కూడా జారీ కావడంతో కాపులు ఎమ్మార్వో కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు.
దరఖాస్తులు చేసుకోవడానికి గడువు తక్కువగా ఉండటంతో కుల ధృవీకరణ, ఇతర పత్రాల కోసం దరఖాస్తుదారులు ఆయా కార్యాలయాల వద్ద సందడి చోటు చేసుకుంది. ముద్రగడ సభకు కాపులు వెళ్ళకుండా చూసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications