ముంబై డ్యాన్సర్ గ్యాంగ్ రేప్: అతను ఎవరు?

నిజామాబాద్‌: ముంబై డ్యాన్సర్ కమ్ మోడల్ సామూహిక అత్యాచారం కేసులో నిందితుడు వెంకటరాజుపై స్థానికులు మొదటి నుంచి అనుమాన పడుతూనే ఉన్నారు. ఈ మేరకు స్థానిక మీడియాలో సోమవారం వార్తలు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా పోచంపాడుకు చెందిన వెంకట రాజును శుక్రవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిరు వ్యాపారాలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపే వెంకటరాజుపై స్థానికులకు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

అతడిని అమ్మాయిల బ్రోకర్‌గా స్థానికులు మొదట భావించారు. వెంకటరాజు పోచంపాడ్‌లో పాల డిస్ట్రిబ్యూటర్ కాగా, హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకుని మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. అప్పుడప్పుడు లగ్జరీ కారులో గ్రామానికి వస్తుండేవాడు. ఇతడు హైదరాబాద్‌లో స్నేహితులతో కలిసి డ్యాన్సర్లు, అమ్మాయిలను ఒప్పందం కుదిర్చేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. డిసెంబర్ 31న వెంకటరాజు అపార్టుమెంట్‌లోనే ముంబై డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం జరిగినట్టు భావిస్తున్నారు. సీసీఎస్ పోలీసుల బృందం పోచంపాడ్ కూడా వచ్చి విచారించారు.

Mumbai dancer case: Who is Venkat Raju?

వెంకటరాజు భార్య, పిల్లలు, తల్లి పోచంపాడులో ఉంటుండగా వెంకటరాజు మాత్రం హైదరాబాద్‌లో ఉంటాడు. తల్లి, భార్య స్థానికంగా కిరాణాషాప్ నడుపుతారు. కరీంనగర్ జిల్లా తాటిపల్లి నుంచి ఇక్కడికి వలస వచ్చారు. తండ్రి రాజేశ్వ ర్ ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

వెంకటరాజు ఎవరెవరితో సంబంధాలు కొ నసాగించాడనేది పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశాలున్నాయి. ఈవెంట్ మేనేజర్ నితిన్‌యాదవ్ అలియాస్ హ్యాపీ నిర్వహించే నూతన సంవత్సర వేడుకల్లో డ్యాన్స్ చేయడానికి వెంకట్రాజు డ్యాన్సర్‌తో ఒప్పందం కుదిర్చాడు. కానీ ఆమె ను అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి తోటి స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు.

ఆ తర్వాత ఆమెను ట్రా వెల్స్ బస్సులో ఎక్కించి ముంబైకి పంపించా రు. ఆమె ఎటీఎం కార్డు అపహరించి డబ్బును కూడా డ్రాచేసుకున్నారు. రూ.40వేలు ఒక సా రి, రూ.17వేలు మరోసారి డ్రా చేశారు. రేప్ కేసులో హ్యాపీ, అలీ అలియాస్ అజయ్‌శ ర్మ, వెంకటరాజు, హరికృష్ణలపై కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+