డ్యాన్సర్ గ్యాంగ్‌రేప్: డ్రైవర్ హరికృష్ణ లొంగుబాటు
హైదరాబాద్: ముంబై మోడల్ కమ్ డ్యాన్సర్ రక్షిత సామూహిక అత్యాచార కేసులో నాలుగో నిందితుడు డ్రైవర్ హరికృష్ణ ఆదివారం సికింద్రాబాదులోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇప్పటి వరకూ నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మరో నిందితుని కోసం పోలీసులు వేటను కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ నగర పోలీసులు వేగంగా వివరాలను సేకరిస్తున్నారు, నిందితులు బాధితురాలును నగరంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్ళారు, పోలీసులు ఆమెను ఆ స్థలాలకు తీసుకువెళ్ళి, ఆమె చెప్పిన సమాచారం ప్రకారం నిందితులను గాలించి పలు చోట్ల దాగి ఉన్న నిందితులను పోలీసులు ఆరెస్టు చేశారు.

ఇతర వివరాల కోసం, పరారీలో ఉన్న ఆఖరి నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 31న ఓ ప్రాగ్రాం కోసం నగరానికి వచ్చిన మోడల్ రక్షిత గ్యాంగ్ రేప్‌కు గురైన విషయం తెలిసిందే.
హైదరాబాదులో సామూహిక అత్యాచారానికి గురైన ముంబయి డ్యాన్సర్ కేసును పోలీసులు చేధించారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సిసిఎస్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో నగరానికి చెందిన ఈవెంట్ మేనేజర్ హ్యాపీ అలియాస్ నితిన్ యాదవ్, అలీ అలియాస్ అజయ్ శర్మ, నిజామాబాద్‌కు చెందిన వెంకటరాజు, హరికృష్ణలుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications