నాడు సమైక్యం కోసం, నేడు హోదా కోసం: మునికోటి బలిదానం, ప్రత్యేక చిచ్చు
త్తూరు/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మునికోటి బలిదానం చేసుకున్న నేపథ్యంలో... ఏపీలో పలుచోట్ల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల్లో హోదా కోసం ఆయా పార్టీలు, ప్రజలు నినదిస్తున్నారు.
మునికోటి మృతి నేపథ్యంలో ఏపీలో ప్రత్యేక చిచ్చు రాజుకుంది. హోదా సాధించడమే మునికోటికి అసలైన నివాళి అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే చంద్రబాబు కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య అన్నారు. మునికోటి మృతి పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు, వైసిపీ అధ్యక్షులు జగన్, కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి, చిరంజీవిలు సంతాపం తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సంతాపం తెలిపారు.
అయితే, హోదా కావాలంటూ ఏపీలో పలుచోట్ల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
సోమవారం నాడు వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయనున్నారు. ఈ ధర్నా ద్వారా ఆయన మునికోటి అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకు వెళ్లనున్నారు. హోదా కోసం ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్ర్యతేక హోదా గురించి ఎవరూ భావోద్వేగాలకు లోను కావొద్దని, ఆందోళన చెందవద్దని చంద్రబాబు కోరారు. ప్రత్యేక హోదా కోసం తాము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. ఎలాంటి అఘాయిత్యాలకు ఎవరూ పాల్పడరాదన్నారు.
త్వరలోనే తాను ఢిల్లీకి వెళుతున్నానని, అన్ని విషయాలను ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తానని చెప్పారు. ఏపీ ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఇదిలా ఉండగా, రేపు మునికోటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన అంత్యక్రియల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొననన్నారు.
కాగా, మునికోటి ఉద్యమాలే ఊపిరిగా బతికాడు. నాడు సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాడు. నేడు ప్రత్యేక హోదా కోసం బలిదానం చేసుకున్నాడు. ప్రత్యేక హోదా రాదని భావించి ఆత్మహత్యకు యత్నించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తిరుపతిలోని మంచాల వీధికి చెందిన మునికామకోటి ఏపీ విడిపోకూడదని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తిరుపతిలోని ప్రముఖ గంగమ్మ దేవాలయంలో కమిటీ సభ్యుడిగా కూడా పని చేశాడు. మునికోటికి 12 సంవత్సరాల క్రితం వివాహం కాగా, భార్యతో మనస్పర్థలతో పదేళ్ల క్రితం విడిపోయాడు.
కోటి తల్లిదండ్రులు మృతి చెందడంతో, తన తమ్ముడి ఇంట్లో ఉంటుండేవాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కలేదని బంధువులు, మిత్రులతో బాధపడేవాడు. మునికోటి ప్రాణాలు విడిచాడని తెలిసి అతని సోదరుడు మురళి, ఇతర కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications