పోలింగ్ వేళ పులివెందులలో జగన్ - కీలక పరిణామాలు, హైకోర్టు ఆదేశాలు..!!
పులివెందుల రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. ఇక్కడ ఎలాగైనా గెలవాలని టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాజీ సీఎం జగన్ ఓటు వేసేందుకు పులివెందుల వస్తున్నారు. అటు టీడీపీ నేతలు రౌడీయిజం చేసేందుకు సిద్దం అవుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతల పైన టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలోనే పులివెందుల ఎన్నికపైన హైకోర్టు ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాల వేళ రాజకీయంగా మరింత ఆసక్తి ని పెంచుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా రేపు (ఆదివారం) మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పులివెందుల పోలింగ్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సారి ఇక్కడ ఎలాగైనా గెలవాలని టీడీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తన ఇలాకాలో టీడీపీకి అవకాశం ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పులివెందుల కేంద్రంగా కేడర్ కు దిశా నిర్దేశం చేసారు. రేపు ఉదయం జగన్ బెంగళూరు నుంచి పులివెందుల రానున్నారు. 15వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పులి వెందుల ఓటింగ్ సమయంలో తాను ఇక్కడే ఉంటానని.. ఎవరు వస్తారో రావాలని జగన్ సవాల్ చేసారు. దీనికి కూటమి నేతలు ధీటుగా స్పందించారు. రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతున్న వేళ ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. పులివెందులలో నిష్పాక్షికంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటీషన్ దాఖలు చేసారు.

భారీ బందోబస్తు.. రాజకీయ ఉత్కంఠ
దీంతో, ఈ అభ్యర్ధన పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. బయట ప్రాంతాల వారు వచ్చి అలజడి రేపేందుకు సిద్దం అవుతున్నారని అవినాశ్ కోర్టులో తన పిటీషన్ లో పేర్కొన్నారు. అటు పులివెందులలో బయట వారిని పంపేసారు. పోలీసు బలగాలను పెద్ద ఎత్తు న మొహరించారు. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందులలో ఇక్కడ గెలుపు ఇప్పుడు వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఎన్నడూ లేని ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఈ ఎన్నిక వేళ జగన్ చేసిన వ్యాఖ్యలు.. నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న ఘటనలు.. టీడీపీ ప్రయత్నాలు మరింతగా ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇక్కడ విజయం సాధించడం అధికార, ప్రతిపక్ష పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కుప్పం మున్సిపాల్టీ లో గెలిచారు. ఇప్పుడు పులివెందులలో గెలవాలనేది టీడీపీ లక్ష్యం. దీంతో.. ఇక్కడ పోలింగ్.. ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications
