పత్తిపై కేంద్రం తాజా నిర్ణయం: డిసెంబర్ 31 వరకూ

పత్తి పంట దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై ఉన్న కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఈ గడువు నేటితో ముగియాల్సి ఉండగా.. దీన్ని ఇక డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల స్థానిక మార్కెట్‌లో ముడి పత్తి కొరత తీరడంతో పాటు టెక్స్‌టైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఉత్పత్తి వ్యయాల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ కొద్దిసేపటి కిందటే ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1962 కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 25 (1), ఆర్థిక చట్టం 2021లోని సెక్షన్ 124 ఆధారంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. ప్రజా ప్రయోజనాలు, దేశీయ జౌళి పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది.

Centre has extended the customs duty exemption on cotton imports by two months till December 31

ఈ నిర్ణయం వల్ల టెక్స్‌టైల్, గార్మెంట్ తయారీ సంస్థలకు ముడిసరుకు కొనుగోలు వ్యయం బాగా తగ్గుతుంది. ప్రత్యేకించి పత్తిపై ఎక్కువగా ఆధారపడి పనిచేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూత ఇచ్చినట్టయింది. దేశీయంగా ముడి పత్తి ధరల్లో స్థిరత్వాన్ని కూడా కల్పించినట్టయింది. వస్త్ర తయారీ రంగానికి అవసరమైన ముడిసరుకు సరఫరా మెరుగవ్వడం వల్ల పరిశ్రమలలో ఉత్పత్తి ప్రక్రియ ఎటువంటి అంతరాయాలు లేకుండా సాగుతుంది.

మన శ్రీసిటీలో రూపుదిద్దుకున్న డ్రైవర్‌ లెస్ మెట్రో రైలు: ఆక్వా లైన్ లో పరుగులు
మన శ్రీసిటీలో రూపుదిద్దుకున్న డ్రైవర్‌ లెస్ మెట్రో రైలు: ఆక్వా లైన్ లో పరుగులు

సరఫరా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల తయారీ సంస్థలపై పడే అదనపు ఆర్థిక భారం తప్పుతుంది. ఇది పరోక్షంగా సాధారణ వినియోగదారులకు కూడా లబ్ధి చేకూరుస్తుంది. దేశీయ మార్కెట్ లో దుస్తులకు లభించే డిమాండ్‌కు అనుగుణంగా తయారీదారులు తమ ఉత్పత్తుల తయారీని మరింత వేగవంతం చేయడానికీ ఈ సడలింపు దోహదపడుతుంది. అంతర్జాతీయ స్థాయి ఎదురవుతోన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి, దేశీయ వస్త్ర పరిశ్రమలో స్థిరత్వాన్ని కల్పించడానికి ఈ నిర్ణయం సహాయపడుతుందని టెక్స్ టైల్ ఇండస్ట్రీ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+