AC Cover: కేవలం రూ. 250 తో మీ ఏసీ లైఫ్‌ను పెంచేయండిలా!

చలికాలం ప్రారంభం కావడంతో దాదాపు అందరి ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) విశ్రాంతి తీసుకోనున్నాయి. రాబోయే నాలుగు ఐదు నెలల పాటు ఏసీలతో ఎలాంటి పని ఉండదు కాబట్టి, ఇండోర్ యూనిట్ బంద్ చేసి ఊరుకుంటారు. అయితే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే.. ఇంటి బయట లేదా బాల్కనీలో ఉండే ఔట్‌డోర్ యూనిట్‌ను అలాగే వదిలేయడం! దుమ్ము, ధూళి, పొగమంచు, వర్షం, పిట్టల రెట్టల వల్ల ఆ కొన్ని నెలల వ్యవధిలోనే ఏసీ ఔట్‌డోర్ భాగం తీవ్రంగా పాడైపోతుంది. కానీ, ఆన్‌లైన్ లో కేవలం రూ. 250 కే లభించే ఒక చిన్న ఏసీ కవర్ కొని కప్పడం ద్వారా వచ్చే వేసవికి వేల రూపాయల రిపేర్ ఖర్చుల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.

డ్యామేజ్ అంతా ఔట్‌డోర్ యూనిట్‌కే ఎందుకు?

ఏసీకి గుండెకాయ లాంటి కాంప్రెసర్, కండెన్సర్ కాయిల్స్, ఫ్యాన్, సర్క్యూట్ బోర్డ్ అన్నీ ఔట్‌డోర్ యూనిట్‌లోనే ఉంటాయి. ఇవి బాల్కనీల్లో లేదా టెర్రస్‌పై ఎలాంటి రక్షణ లేకుండా ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో పెరిగే దుమ్ము, పొగమంచు వల్ల కండెన్సర్ కాయిల్‌లోని సన్నని అల్యూమినియం భాగాల్లో ధూళి పేరుకుపోతుంది. తేమ తగలగానే అది గట్టిపడి లోహపు భాగాలను, వైరింగ్‌ను వేగంగా తుప్పు పట్టేలా చేస్తుంది. మరోవైపు పావురాలు అక్కడ గూళ్లు కట్టుకోవడం, వాటి ఆమ్లపూరితమైన రెట్టలు పడటం వల్ల బాడీ కలర్ ఊడిపోయి కాయిల్స్ పాడైపోతాయి.

How a Rs 250 AC Cover Can Save You Thousands in Repair Bills and Lower Power Bills This Winter Season

కవర్ వాడకపోతే జేబుకు పెద్ద చిల్లే!

శీతాకాలమంతా ఓపెన్‌గా వదిలేసిన ఏసీని మళ్లీ వేసవిలో ఆన్ చేసే ముందు జనరల్ సర్వీస్ సరిపోదు. మామూలు సర్వీసింగ్‌కు రూ. 500 నుంచి రూ. 800 ఖర్చయితే, దుమ్ము పేరుకుపోయిన కాయిల్స్ శుభ్రం చేయడానికి జెట్ లేదా కెమికల్ వాష్ చేయాల్సి వస్తుంది. దీనికి రూ. 1,000 నుంచి రూ. 1,500 అవుతుంది.

అంతేకాకుండా, తుప్పు వల్ల గ్యాస్ లీక్ అయితే గ్యాస్ నింపడానికి, లీకేజ్ సరిచేయడానికి రూ. 2,500 నుంచి రూ. 4,500 వరకు గుంజుతారు. ఒకవేళ ఔట్‌డోర్ పీసీబీ (PCB) బోర్డు పాడైతే రూ. 3,000 నుంచి రూ. 8,000, కండెన్సర్ కాయిల్ మార్చాల్సి వస్తే బ్రాండ్‌ను బట్టి రూ. 10,000 వరకు జేబుకు చిల్లు పడుతుంది. వీటితో పోలిస్తే రూ. 250 కవర్ ఎంత మేలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు!

ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!

కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది!

కండెన్సర్ కాయిల్స్ పై దుమ్ము పడితే అది వేడిని సరిగ్గా బయటకు పంపలేదు. దీనివల్ల గది చల్లబడటానికి కాంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా వేసవిలో రోజూ 8 నుంచి 10 గంటలు ఏసీ వాడే ఇళ్లలో కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది. కాయిల్స్ శుభ్రంగా ఉంటే గది త్వరగా చల్లబడి, కాంప్రెసర్ త్వరగా ఆఫ్ అయి కరెంట్ ఆదా అవుతుంది. అలాగే చలికాలంలో ఏసీ మైన్ స్విచ్ లేదా MCB ఆఫ్ చేయడం వల్ల కూడా కొంత మేర విద్యుత్ ఆదా చేసుకోవచ్చు.

సరైన కవర్‌ను ఎలా ఎంచుకోవాలి?

షాపింగ్ సైట్లలో 1 టన్, 1.5 టన్, 2 టన్ ఏసీల పరిమాణాన్ని బట్టి కవర్లు దొరుకుతాయి. మీ ఏసీ ఔట్‌డోర్ యూనిట్ పొడవు, వెడల్పు కొలుచుకుని తీసుకోవడం మంచిది. వాటర్ ప్రూఫ్, ఎండకు పాడవని (UV resistant) క్వాలిటీ ఉన్నది, కింద తాడు లేదా ఎలాస్టిక్ ఉన్న కవర్ ఎంచుకుంటే గాలికి కొట్టుకుపోకుండా ఉంటుంది. పక్కన గాలి వెళ్లేందుకు చిన్న రంధ్రాలు (vents) ఉండే కవర్లు లోపల తేమ చేరకుండా కాపాడతాయి. సాధారణంగా ఇవి రూ. 200 నుంచి రూ. 600 మధ్యలో లభిస్తాయి.

ఏసీలతో కాలుష్యం.. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్.. చెయ్యాల్సిందిదే.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక!
ఏసీలతో కాలుష్యం.. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్.. చెయ్యాల్సిందిదే.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక!

ఈ తప్పులు అస్సలు చేయకండి!

  • ఏసీ కవర్ వేసే ముందు యూనిట్‌ను బాగా తుడుచుకుని శుభ్రం చేయాలి.
  • మురికితో ఉన్నప్పుడు కవర్ వేస్తే ఆ తేమకే తుప్పు పడుతుంది.
  • ఏసీ ఆన్ చేసే ముందు కవర్‌ను ఖచ్చితంగా తీసేయాలి.
  • కవర్ తీయకుండా ఏసీ వేస్తే కాంప్రెసర్ వేడెక్కి కొద్ది నిమిషాల్లోనే కాలిపోతుంది.
  • ప్లాస్టిక్ కవర్లు లేదా పాలిథిన్ కవర్లను చుట్టకూడదు, అవి తేమను లోపలే బంధించి తుప్పును మరింత వేగవంతం చేస్తాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+