కళ్లముందే నక్షత్ర మండలాలు.. దేశంలోనే తొలి 8K ప్లానిటోరియం

అంతరిక్ష రహస్యాలను, నక్షత్ర మండలాల అద్భుతాలను కళ్లముందే ఆవిష్కరించే సరికొత్త విజ్ఞాన కేంద్రం మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. కర్ణాటకలోని మైసూరు నగరంలో దేశంలోనే మొట్టమొదటి 8K రిజల్యూషన్ ఎల్ఈడీ డోమ్ ప్లానిటోరియంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 'కాస్మోస్-మైసూరు' (COSMOS-Mysuru) పేరుతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, మైసూరు విశ్వవిద్యాలయం సంయుక్తంగా దీనిని నిర్మించాయి. సాధారణ ప్లానిటోరియంలకు పూర్తి భిన్నంగా, అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రం సందర్శకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది.

ప్రొజెక్టర్లకు కాలం చెల్లింది.. డోమ్ మొత్తం ఒక భారీ టీవీ స్క్రీన్!

సాధారణంగా మనకు తెలిసిన ప్లానిటోరియంలలో శక్తివంతమైన ప్రొజెక్టర్ల సాయంతో గుండ్రటి డోమ్ లోపలి భాగంపై నక్షత్రాలు, గ్రహాల బొమ్మలను ప్రసారం చేస్తారు. అక్కడ డోమ్ కేవలం ఒక తెరలా మాత్రమే పనిచేస్తుంది. కానీ 'కాస్మోస్-మైసూరు' పనితీరు పూర్తిగా వేరు. ఇక్కడ ప్రొజెక్టర్లతో పనిలేకుండా, డోమ్ లోపలి భాగాన్ని వేలాది ఎల్ఈడీ ప్యానెల్స్‌తో నిర్మించారు. దీనివల్ల ఆ డోమ్ మొత్తం ఒక భారీ వంపుతిరిగిన టెలివిజన్ స్క్రీన్‌లా మారిపోతుంది. ప్రతి ఎల్ఈడీని విడివిడిగా నియంత్రించే వీలుండటంతో, అంతరిక్ష దృశ్యాలు అత్యంత ప్రకాశవంతంగా, స్పష్టంగా, కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.

PM Modi Inaugurates India s First 8K LED Dome Planetarium COSMOS-Mysuru Offering Immersive Space Visuals
ఆకాశంలో పిడుగుల వర్షం.. 17 వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీ!
ఆకాశంలో పిడుగుల వర్షం.. 17 వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీ!

4.2 కోట్ల ఎల్ఈడీలు.. 15 మీటర్ల భారీ డోమ్ ప్రత్యేకత ఇదే!

ఈ ప్లానిటోరియంలోని డోమ్ 15 మీటర్ల వెడల్పు కలిగి ఉండి, 15 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఇందులో సుమారు 6,150 ఎల్ఈడీ ప్యానెల్స్ అమర్చగా, వాటిలో దాదాపు 4.2 కోట్ల సూక్ష్మ ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి 8K రిజల్యూషన్‌తో అత్యద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి. అంతేకాకుండా టెలిస్కోపుల ద్వారా అందే లైవ్ అంతరిక్ష సమాచారాన్ని కూడా ఇందులో నేరుగా వీక్షించే అవకాశం ఉండటం దీని మరో ప్రత్యేకత.

చెరకు, మొక్కజొన్న అక్కర్లేదు.. జుట్టు నుంచే ఇథనాల్.. గుజరాత్ స్టార్టప్ సంచలనం!
చెరకు, మొక్కజొన్న అక్కర్లేదు.. జుట్టు నుంచే ఇథనాల్.. గుజరాత్ స్టార్టప్ సంచలనం!

విజ్ఞాన వినోదమే కాదు.. విద్యార్థులకు పరిశోధనా వేదిక!

'కాస్మోస్-మైసూరు' కేవలం ఆకాశ వింతలను చూపించే వినోద కేంద్రం మాత్రమే కాదు, ఆస్ట్రోఫిజిక్స్, ట్రైనింగ్ కు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ఈ కేంద్రం ప్రారంభానికి ముందే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ గత మూడేళ్లలో 150కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 40 వేల మందికి పైగా విద్యార్థులు, ప్రజలకు ఖగోళ శాస్త్రంపై ఆసక్తిని పెంచింది. రానున్న రోజుల్లో విద్యార్థులకు శిక్షణ, డేటా విశ్లేషణ వంటి కార్యక్రమాల ద్వారా విశ్వ రహస్యాలను సులభంగా అర్థం చేసుకునేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+