కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం, 60 ఏళ్ల తరువాత - 16వ తేదీ నుంచి, ప్రత్యేకతలు..!!
ప్రసిద్ధ కొండగట్టు అంజనేయ స్వామి దేవాలయంలో ఆరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. 60 సంవత్సరాల తర్వాత అరుదైన చందనోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 16 నుండి 20 వరకు జరుగుతుంది. ఈ వేడుకలో, దేవత యొక్క అసలు రూపం పై 60 సంవత్సరాలుగా ఉన్న చందనాన్ని తొలగించే వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో, ఆంజనేయుడి నిజ రూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు అంజన్న ఆలయంలో 60 ఏళ్ల తర్వాత అద్బుత ఘట్టం. అత్యంత అరుదైన చందనోత్సవం .. సంప్రోక్షణ మహోత్సవం ముహూర్తం ఖరారు చేసారు. 41 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభించనుంది. ఇందుకు సంబంధించి భక్తులకు దర్శన సమయాలతో పాటుగా ప్రత్యేక ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. 60 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువు నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనుంది.

బాల్యంలో ఈ ఉత్సవాన్ని దర్శించుకున్న భక్తులకు జీవిత చర మాంకంలో మాత్రమే తిరిగి చూసే అరుదైన అవకాశం లభిస్తుందనే బలమైన విశ్వాసం వందల ఏళ్లుగా భక్తుల్లో కొనసాగుతోంది. ఈ పవిత్ర ఉత్సవంలో భాగంగా స్వామివారి మూలవిరాట్‌పై ఉన్న చందనం, సింధూరాన్ని వేద మంత్రోచ్ఛా రణల మధ్య సంప్రదాయబద్ధంగా తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఇక, నవంబర్ 20వ తేదీ ఉదయం 9.59 గంటలకు స్వామివారి మూలవిరాట్ నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులకు 41 రోజుల పాటు స్వామివారి అసలు రూపాన్ని దర్శించుకునే అద్భుత అవకాశం అందుబాటులో ఉండనుంది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
భక్తులకు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా దర్శన క్యూలైన్లు, తాగునీరు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్నగా భావించే భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
