పిల్లలకు, పేరెంట్స్‌కి, టీచర్స్‌కి గొప్ప సందేశాన్ని ఇచ్చే చిత్రం

నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌లో దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన సినిమా 'జయంత్ అండ్ ద జింగో పెన్'. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

వరల్డ్ వైడ్‌గా ఓటీటీలో అత్యంత భయానక హారర్ సినిమా ఇదొక్కటే
వరల్డ్ వైడ్‌గా ఓటీటీలో అత్యంత భయానక హారర్ సినిమా ఇదొక్కటే

స్టోరీ
జయంత్ (జయంత్ బొలిశెట్టి)కి లెక్కలు అంటే భయం. ఆ సబ్జెక్ట్ అంటే ఏంటో జయంత్‌కి అంతు పట్టదు. పైగా లెక్కల మాస్టారు హర్ష (సత్యం రాజేష్) సైతం ఎప్పుడూ పిల్లల్ని భయపెడుతూ పాఠాలు చెప్తుంటాడు. స్కూల్లో జయంత్‌ని చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. జయంత్ అండ్ గ్యాంగ్ ఎఫ్పుడూ స్కూల్‌కి లేటుగా వస్తూ, మార్కుల్లో చివరి స్థానంలో ఉంటుంది. జయంత్ అల్లరి చేష్టల వల్ల పేరెంట్స్ (ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్)లకు ఎప్పుడూ ఏదో ఒక తలవంపు వస్తూనే ఉంటుంది. మరి జయంత్‌కి ఈ జింగో పెన్ దొరికిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు ఈ జింగో పెన్ వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో అశోక్ కుమార్, కెప్టెన్ సత్యహరిశ్చంద్ర ప్రసాద్ (తణికెళ్ల భరణి), ప్రిన్సిపాల్ (కాశీ విశ్వనాథ్) ఇంపార్టెన్స్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

Jayanth And The Jingo Pen Movie Review Heartwarming Message for Kids and Parents Full Details Here

పిల్లల కోణంలోంచి చెప్పే కథలు ఎప్పుడూ మనసుని హత్తుకుంటాయి. పిల్లలు బయటకు చెప్పుకోలేని బాధలు, వారి మనోగతం, వారి సంఘర్షణ తెరపై ఎంతో హృద్యంగా కనిపిస్తుంటాయి. గురువులు, తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో చూపించేలా మంచి సందేశాన్నిచ్చేలా సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీకి పాటలు, మాటలు ప్రధాన బలం అవుతాయి. పిల్లలు, పేరెంట్స్, గురువులు తప్పకుండా చూడాల్సిన మూవీగా 'జయంత్ అండ్ ద జింగో పెన్' నిలిచిందని చెప్పుకోవచ్చు.

ఫస్టాఫ్‌లో స్టోరీ అంతా సరదా సరదాగా సాగుతుంది. జయంత్ చేసే అల్లరి పనులు, స్కూల్లో జయంత్ మిత్రబృందం కామెడీ ఇవన్నీ ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. జయంత్ తన తల్లి, తండ్రితో మాట్లాడే మాటలు, దేవుడి గురించి అడిగే సందేహం.. ఇలా అన్నీ కూడా అంతర్లీనంగా సందేశాన్ని ఇచ్చేలా ఉంటాయి. పేర్లు వేరే అయినా టేస్ట్ ఒకటే.. పేర్లు వేరైనా దేవుడు ఒకటే.. అని చెప్పే సీన్, అక్కడి డైలాగ్స్ బాగుంటాయి. ఊహ, జయంత్ మధ్య వచ్చే సీన్స్ కూడా సరదాగా ఉంటాయి. లెక్కల మాస్టారుని పోలీసుల వద్ద జయంత్ ఇరికించడం, ఆ విషయంలో జయంత్‌ని ఊహ కనిపెట్టడం వంటి సీన్లతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.

ఒళ్లు గగుర్పొడిచేలా 'జంగా’ గ్లింప్స్.. రా రండ్ రస్టిక్‌గా కొత్త అవతారంలో త్రిగుణ్!
ఒళ్లు గగుర్పొడిచేలా 'జంగా’ గ్లింప్స్.. రా రండ్ రస్టిక్‌గా కొత్త అవతారంలో త్రిగుణ్!

సెకండాఫ్‌లో జయంత్ వద్దకు జింగో పెన్ రావడం, ఆ తర్వాత లెక్కల్ని సాల్వ్ చేయడం.. క్లాసులో, స్కూల్లో హీరోగా జయంత్ మారడం ఇలా అన్ని సీన్లు పిల్లలకు నచ్చేస్తుంటాయి. ఆ తర్వాత జింగో పెన్ చెప్పినట్టుగా బుద్ధిగా జయంత్ నడుచుకోవడం, స్కూల్లో జయంత్ చెప్పే టిప్స్ ఇలా అందరికీ ఉపయోగపడతాయి. ఆ తర్వాత స్కూల్ బస్ ప్రమాదం, ఊహ హాస్పిటల్‌లో ఉండటం వంటి సీన్లన్నీ ఎమోషనల్‌గా సాగుతాయి. ఓటమిని కూడా సెలెబ్రేట్ చేసుకోవాలి.. అని లెక్కల మాస్టర్ తన పిల్లలకు చెప్పే సీన్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. తాత, మనవడి సన్నివేశాలు కూడా హార్ట్ టచింగ్‌గా ఉంటాయి.

చివరకు ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్‌లో తండ్రి, కొడుకుల సంభాషణ, జయంత్‌లో వచ్చే పరివర్తన అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి.. పిల్లలు ఎలా మెలగాలి అని చక్కటి సందేశాన్ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించారు. చిరవకు ఓ చక్కటి సినిమాని, ఆహ్లాదకరమైన సినిమాని, అసభ్యకరమైన సన్నివేశాలు లేని ఓ క్లీన్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.

ఎవరెలా నటించారంటే?
నటీనటుల విషయానికి వస్తే.. జయంత్ తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటాడు. మొదటి సినిమానే అయినా ఎంతో అవలీలగా నటించేశాడు. నవ్వించాడు, ఏడ్పించాడు, ఆలోచింపజేశాడు. ఆశిష్ గాంధీ తండ్రి పాత్రలో ఎంతో నేచురల్‌గా కనిపిస్తాడు. మానస పర్వాలేదనిపించింది. ఆ తర్వాత తణికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, అశోక్ కుమార్ వీరంతా కూడా తమ అనుభవాన్ని చూపించారు. సత్యం రాజేష్‌కి మంచి పాత్రల లభించింది. బేబీ ఊహ తెరపై ఎంతో క్యూట్‌గా కనిపించింది. జయంత్ గ్యాంగ్, ఇతర పిల్లలు అందరూ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం
టెక్నికల్‌గా చూసుకుంటే విజువల్స్ సహజంగా ఉన్నాయి. మ్యూజిక్ లైవ్లీగా ఉంది. ప్రవీణ్ బొలిశెట్టి ఇచ్చిన పాటలు సందర్భోచితంగా, అర్థవంతంగా ఉన్నాయి. మాటలు హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. ఆర్ట్ వర్క్, క్యాస్టూమ్, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కొత్త నిర్మాత అయిన దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మొదటి సినిమాగా ఓ చక్కటి విలువలతో కూడిన ప్రాజెక్ట్‌‌ని అభిమానులకు అందించారు.

ఫైనల్‌గా ..
'జయంత్ అండ్ ద జింగో పెన్' కేవలం పిల్లల సినిమా మాత్రమే కాదు. ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పకుండా చూడాల్సిన సినిమా. వినోదంతో పాటు చక్కటి సందేశం కోరుకునే ఫ్యామిలీ అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

రేటింగ్: 3/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+